ETV Bharat / international

సగం ఆసుపత్రులు పనికిరాకుండా పోయాయి!

author img

By

Published : Aug 13, 2020, 3:20 PM IST

లెబనాన్ దేశానికి భారీ పేలుడు తీరని నష్టం కలిగించింది. పేలుడు జరిగిన బీరుట్ ప్రాంతంలో సగానికి పైగా ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయి. ఆ ఘటనలో గాయపడినవారికి సైతం వైద్యం అందని దుస్థితి ఏర్పడింది.

in-lebanon-capital-beirut-more-than-half-of-the-total-hospitals-effected-by-blast
సగానికిపైగా ఆసుపత్రలుు పనికిరాకుండాపోయాయి!

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో భారీ పేలుడు తర్వాత పరిస్థితి నానాటికి దిగజారుతోంది. నగరానికి అవసరమైన ఆహార ధాన్యాల గోదాము ఓడరేవులోనే ఉండటంతో ధ్వంసమైపోయింది. నోటికందాల్సిన ఆహారం నీటిపాలైంది. ఆ పేలుడు తీవ్రతకు దాదాపు 5,000 మంది గాయపడ్డారు. కానీ, వీరికి చికిత్సను అందించేందుకు తగినన్ని ఆసుపత్రులు అందుబాటులో లేవు. పులిమీద పుట్రలాగా.. నగరంలోని దాదాపు సగం ఆసుపత్రులు పనికిరాని స్థితికి చేరుకొన్నాయి.

in-lebanon-capital-beirut-more-than-half-of-the-total-hospitals-effected-by-blast
సగానికిపైగా ఆసుపత్రులు పనికిరాకుండాపోయాయి!

నగరంలోని ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ గదులు నిరుపయోగంగా మారాయి. చాలా ఆసుపత్రుల్లో పరికరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే వెల్లడించింది. బీరుట్‌లో మొత్తం 55 క్లినిక్‌లు ఉన్నాయి. వీటిల్లో సగం పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ బ్రెన్నన్‌ తెలిపారు. వీటిల్లో మూడు పెద్ద ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. మృతుల సంఖ్య 170ని దాటినట్లు సమాచారం.

గతేడాది నుంచి దేశంలో ఆర్థిక సంక్షోభం ఉండటంతో ఆ ప్రభావం ఆసుపత్రులపై కూడా పడింది. అత్యవసరాల్లో వినియోగించే పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు చెల్లింపులే మిలియన్ల డాలర్లలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు పేలుడు కారణంగా ఉన్న అరకొర పరికరాలు దెబ్బతిన్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు రెండు నెలలకు సరిపడా వైద్య పరికరాలను పేలుడు జరిగిన తొలిరోజే వాడాల్సి వచ్చిందని రెడ్‌క్రాస్‌ బృందం వెల్లడించింది. దీంతో చాలా మంది బాధితులకు చికిత్స అందలేదు.

ఇదీ చదవండి: తెల్లకాకిని ఎప్పుడైనా చూశారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.