ETV Bharat / international

తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొన్న ఫేస్‌బుక్‌!

author img

By

Published : Aug 17, 2021, 11:44 AM IST

తాలిబన్లను ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్​బుక్ ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన సమాచారంపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ​

facebook app
తాలిబన్ల న్యూస్

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన కంటెంట్‌ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, తాలిబన్లు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లను పంపే వాట్సాప్‌ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేకపోవడం గమనార్హం.

ఫేస్‌బుక్‌ ప్రతినిధి మాట్లాడుతూ అఫ్గాన్‌లో పరిస్థితిని తమ సంస్థ నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. నిషేధిత సంస్థలకు సంబంధించిన ఏదైనా వాట్సాప్‌ ఖాతాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్విట్టర్​ సైతం..

మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకొన్న విషయాన్ని తాలిబన్‌ ప్రతినిధి ట్విట్టర్‌ వేదికగానే ప్రకటించారు. దీనిపై ఓ ఆంగ్ల వార్త సంస్థ ట్విట్టర్​ను ప్రశ్నించగా.. తాము హింసను ప్రోత్సహించే సంస్థలను, విద్వేషాన్ని రెచ్చగొట్టే సంస్థలను ట్విట్టర్​ వినియోగించనీయమని పేర్కొంది. వీటిని ఏ విధంగా గుర్తిస్తారో మాత్రం వెల్లడించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పౌరహక్కులు హరించడం, మహిళలను అణచివేయడం వంటివి చేస్తారని భయపడుతున్నారు. మరోపక్క తాలిబన్‌ ప్రతినిధులు మాత్రం తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ఆ మెసేజ్​లతో జాగ్రత్త.. క్లిక్​ చేస్తే ఖాతా ఖాళీనే!

ఇన్​స్టాలో అలాంటి​ కామెంట్లకు ఇకపై చెక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.