ETV Bharat / international

పాలస్తీనా- ఇజ్రాయెల్‌ రక్తపాతానికి ఏళ్ల క్రితమే బీజం!

పాలస్తీనా- ఇజ్రాయెల్‌ మధ్య కొన్నిరోజులుగా జరుగుతున్న భీకరపోరుకు కొన్నేళ్ల క్రితమే బీజం పడింది. ఈ రెండు దేశాల మధ్య 3చిన్నపాటి యుద్ధాలు కూడా జరిగాయి. 2014లో 50 రోజులపాటు జరిగిన పోరులో 2,220 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు. ఈ దాడుల కారణంగా గాజాలో లక్షల మంది నిరుద్యోగంలోకి వెళ్లగా అక్కడి ప్రజలకు కనీస సదుపాయలు కూడా కరవయ్యాయి.

ISRAEL
పాలస్తీనా- ఇజ్రాయెల్‌ ఘర్షణకు ఏళ్ల క్రితమే బీజం!
author img

By

Published : May 15, 2021, 10:03 AM IST

పాలస్తీనా- ఇజ్రాయెల్‌ మధ్య కొన్నిరోజులుగా యుద్ధవాతారణం నెలకొంది. ఇరువర్గాల మధ్య భీకరపోరు నడుస్తోంది. హమాస్‌ ఉగ్రవాదులు వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నారు. హమాస్‌ రాకెట్‌ దాడులను ఇజ్రాయెల్‌ సమర్థంగా తిప్పికొడుతోంది. ఇదే సమయంలో తీవ్రస్థాయిలో గాజాపై విరుచుకుపడుతోంది. 20లక్షల మంది జనాభా ఉన్న గాజా.. ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో భీతిల్లితోంది. 2008 నుంచి నాలుగోసారి హమాస్‌ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్‌కు మధ్య ఘర్షణలు తలెత్తగా.. గాజా మరోసారి రక్తమోడుతోంది.

ఏంటీ గాజా?

ఇజ్రాయెల్‌, ఈజిప్టు మధ్య తక్కువ మొత్తంలో గాజాకు చెందిన తీర ప్రాంతం ఉంటుంది. ఈ తీర ప్రాంతం విస్తీర్ణం 40 కిలోమీటర్ల పొడవు, 10కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. 1948కి ముందు.. ఈ పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్‌ పాలనలో ఉండేంది. అనంతరం ఈజిప్టు ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో ఇజ్రాయిల్‌ నుంచి పారిపోయి వచ్చిన అనేక మంది వలసవాదులు పాలస్తీనాలోని గాజాలో స్థిరపడ్డారు. 1967 మధ్యప్రాచ్యం యుద్ధంలో ఇజ్రాయెల్‌... వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలేంతోపాటు గాజాను స్వాధీనం చేసుకుంది.

ఇదీ చదవండి: పండుగ రోజూ ప్రశాంతంగా లేని గాజా

అయితే పాలస్తీనియన్లు 3 భాగాలుగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు 1987లో పాలస్తీనియన్లు గాజాని ఏర్పాటు చేసుకున్నారు. అదే సంవత్సరమే హమాస్‌ కూడా ఏర్పడింది. మిగిలిన ప్రాంతాల్ని మాత్రం ఉగ్రవాదులు ఆక్రమించుకన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు 1990 ఓస్లో శాంతి ప్రక్రియ ద్వారా పాలస్తీనా అథారిటీని స్థాపించారు. అ తర్వాత గాజా, వెస్ట్‌బ్యాంకుకు పరిమత స్థాయిలో స్వయంప్రతిపత్తిని కల్పింది.

వారం పాటు ఘర్షణలు

గాజాలో హింసాత్మక ఘటనల అనంతరం 2005లో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తమ దళాలను ఉపసంహరించుకుంది. అదే ఏడాది పాలస్తీనా ఎన్నికల్లో హమాస్‌ విజయం సాధించింది. దీంతో పాలస్తీనా అధ్యక్షుడిగా మహమూద్‌ అబ్బాస్‌ ఫతా అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత వారం రోజుల ఘర్షణలు జరిగాయి. అనంతరం 2007 గాజా ప్రాంతం హమాస్‌ నియంత్రణలోకి వచ్చింది.అప్పటి నుంచి నెమ్మదిగా గాజాపై హమాస్‌ చట్టాలు విధించేలా చేశారు. అయితే ఈ చట్టాల ద్వారా ప్రత్యర్థులు నిరసనలు వ్యక్తం చేయటం, అణిచివేయటం చేయలేదు. హమాస్‌ ఉగ్రసంస్థ ఆధీనంలో 14 ఏళ్లపాటు ఈ ప్రాంతం మనుగడ సాధించింది.

ఇదీ చదవండి: ముమ్మర దాడులు-వలస బాటలో పాలస్తీనియన్లు

ఆంక్షలు.. సంక్షోభం

గాజా ప్రాంతాన్ని హమాస్‌ ఉగ్రవాదులు స్వాధీనం చేస్తున్న తర్వాత ఈజిప్టు, ఇజ్రాయెల్‌ దిగ్భందాన్ని విధించాయి. హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులను ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా ఉంచాల్సిన అవసరం ఉందని.. ఇజ్రాయెల్ దిగ్భందనం సందర్భంగా వ్యాఖ్యానించింది. హక్కుల సంఘాలు ఈ చర్యలను శిక్షణ చర్యలుగా పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: అసలే కరోనా.. ఆపై బాంబుల మోత

ఈ దిగ్భందన చర్యల మూలంగా గాజాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా విద్యుత్‌, తాగు నీరు సంక్షోభం ఏర్పడింది. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నిరుద్యోగం 50 పెరిగింది.

రక్తపాతం

హమాస్‌ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌ మధ్య కొన్నేళ్లుగా వైరం కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య మూడు చిన్నపాటి యుద్ధాలు జరిగాయి. 2014లో అయితే 50 రోజులపాటు భీకర పోరు జరిగింది. ఈ దాడుల్లో 2,220 మంది పాలస్తీనీయన్లు చనిపోయారు. అందులో సగానికిపైగా సామాన్య ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్‌ వైపు 73 మంది చనిపోయారు.

గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేయటం వల్ల అక్కడి అనేక ప్రాంతాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే సమయంలో పౌరుల ప్రాణనష్టాలను నివారించడానికి అన్ని ప్రయాత్నాలు చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై వేల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ క్షిపణి వ్యవస్థ చాలా రాకెట్లను అడ్డుకొని వాటి తీవ్రతను తగ్గించింది. అయితే ఇటీవలి కాలంలో పాలస్తీనా ఇజ్రాయెల్‌ మధ్య దాడుల తీవ్రత మరింత పెరిగింది. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ కోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.