ETV Bharat / international

2022 దీపావళికి దుబాయ్​లో కొత్త హిందూ దేవాలయం - Hindu temple to open in Dubai news updates

దుబాయ్​లో కొత్తగా నిర్మిస్తున్న హిందూ దేవాలయం వచ్చే ఏడాది అక్టోబరు నాటికి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థ పేర్కొంది.

Dubai's newest Hindu temple to open its doors for worshippers by Diwali next year
2022నాటికి దుబాయిలోని కొత్త హిందూ దేవాలయం సిద్ధం!
author img

By

Published : Jan 25, 2021, 10:47 PM IST

దుబాయ్​లో కొత్తగా నిర్మిస్తున్న హిందూ దేవాలయం వచ్చే ఏడాది అక్టోబరు నాటికి అందుబాటులోకి రానుందని స్థానిక మీడియా వెల్లడించింది. జెబిల్ ఆలీలోని గురు నానక్ దర్బార్ పక్కనే విలక్షణ అరేబియా రూపంలో నిర్మిస్తున్న ఈ దేవాలయాన్ని వచ్చే ఏడాది దీపావళీ సందర్భంగా తెరవనున్నట్లు పేర్కొంది. 25వేల చదరపు అడుగుల పరిమాణంలో.. 75 మిలియన్​ దిర్హమ్​ల అంచనా వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తునట్లు వెల్లడించింది.

యూఏఈలోని అతిపురాతన దేవాలయం సింధి గురు దర్బారు ఆలయ విస్తరణలో భాగంగా దీనిని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయాన్ని 1950లో తెరిచారు.

ఆలయ పునాది పూర్తయినట్లు సింధి గురు ఆలయ ట్రస్ట్​ సభ్యుడు రాజు ష్రాఫ్​ తెలిపారు. 2022 దీపావళీ నాటికి భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తయినట్లయితే.. అనేక చర్చిలు, సిక్కు గురు నానక్ దర్బార్ ఉన్న ప్రదేశంలోనే ఓ హిందూ దేవాలయం ఉంటుందని ష్రాఫ్ చెప్పారు.

ఇదీ చూడండి: నేపాల్​లో నిరసనలు- ఆందోళనకారులపై జలఫిరంగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.