ETV Bharat / international

ముమ్మర దాడులు-వలస బాటలో పాలస్తీనియన్లు - gaza

ఇజ్రాయెల్​ బలగాలు- హమాస్​ ఉగ్రవాదుల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరు వర్గాల పరస్పర దాడులతో భయాందోళనకు గురైన పాలస్తీనియన్లు వలస బాట పడుతున్నారు. రెండు వర్గాల మధ్య తాజాగా జరిగిన దాడులతో గాజాలో మృతుల సంఖ్య 122కు పెరిగింది. మరోవైపు ఈ దాడులు తక్షణమే ఆపాలని ఐరాస పిలుపునిచ్చింది.

Palestinians flee
పాలస్తీనానియన్లు
author img

By

Published : May 15, 2021, 5:56 AM IST

ఇజ్రాయెల్‌ బలగాలు, హమాస్‌ ఉగ్రవాద ముఠా మధ్య సాయుధ పోరు నానాటికీ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. రెండు వర్గాలూ పరస్పరం ముమ్మర దాడులు చేసుకుంటుండటం వల్ల పరిస్థితులు భీకర యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో గాజా సిటీ చిగురుటాకులా వణుకుతోంది. నగరం సరిహద్దుల నుంచి వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస బాట పడుతున్నారు.

మరోవైపు వెస్ట్‌ బ్యాంక్‌లో చెలరేగిన ఘర్షణల్లో 10 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ బలగాలు కాల్చిచంపాయి. గాజా నుంచి హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులను కొనసాగిస్తున్నారు. శుక్రవారం వరకు 1,800 రాకెట్లను ఉపయోగించినట్లు సమాచారం. హమాస్‌ దాడులకు ఇజ్రాయెల్‌ దీటుగా బదులిస్తోంది. గాజాపై ఇప్పటికే 600కు పైగా వైమానిక దాడులు చేపట్టింది. తాజా దాడులతో గాజాలో మృతుల సంఖ్య 122కి పెరిగింది. ఇజ్రాయెల్‌ యుద్ధవిమానం ధాటికి గాజాలో నాలుగు అంతస్థుల భవనమొకటి నేలమట్టమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో భార్య (గర్భిణి), భర్తతోపాటు వారి నలుగురు చిన్నారులు ఉన్నారు.

గాజాపై వైమానిక దాడులను నిరసిస్తూ.. ఇజ్రాయెల్‌ ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని పలు ప్రాంతాల్లో పాలస్తీనియన్లు శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇజ్రాయెల్‌ బలగాలపై రాళ్లు రువ్వారు. బలగాలు కాల్పులు జరపడంతో వేర్వేరు చోట్ల 10 మంది మృత్యువాతపడ్డారు. తాజా ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్‌ ప్రధానితో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు.

ఇజ్రాయెల్‌లో హమాస్‌ ఉగ్రవాదుల రాకెట్‌ దాడుల్లో చనిపోయిన కేరళ మహిళ సౌమ్య సంతోష్‌ (30) భౌతికకాయం శనివారం ఉదయం దిల్లీకి చేరుకోనుంది.

దాడులు ఆపాలని ఐరాస పిలుపు

పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులను తక్షణమే ఆపాలని ఐరాస చీఫ్​ ఆంటోనియా గుటెరస్​ విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ వివాదం ఇతర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశముందని వ్యాఖ్యానించారు. "పరిస్థితి చేయిదాటిపోయి.. మానవతా సంక్షోభానికి దారితీస్తుంది. ఉగ్రవాదాన్ని మరింత పెంచుతుంది" అని గుటెరస్ హెచ్చరించారు.

గాజా, వెస్ట్​ బ్యాంక్​, జెరూసలెం ప్రాంతాలపై ఇజ్రాయెల్​ దాడులను ఖండించిన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్​ అబ్బాస్​.. దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని ఐరాస సహా అమెరికాలను​ కోరారు. పాలస్తీనియన్ల హత్యలను అడ్డుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఐరాస స్పందించినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.