ETV Bharat / international

వ్యాక్సినేషన్‌ వేగవంతమైన దేశాల్లో కొవిడ్​ తగ్గుముఖం

కరోనా వ్యాక్సిన్​లు అందుబాటులోకి వచ్చాక కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఫలితంగా ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అమెరికాలోనూ ప్రస్తుతం తక్కువ కేసులు నమోదవుతున్నాయి.

covid-19 vaccination campaign turns the tide
వ్యాక్సినేషన్
author img

By

Published : Apr 14, 2021, 2:39 PM IST

ఏడాది క్రితం కరోనా వైరస్‌ అంటే ఏమిటో సరిగ్గా తెలియదు.. దానికి ఎలా చికిత్స చేయాలో అంతకంటే తెలియదు.. రోగ లక్షణాలను తగ్గించేందుకు మాత్రమే చికిత్స జరిగేది.. ఇక వ్యాధి వ్యాప్తిని నిరోధించే టీకాలపై ఏమాత్రం ఆశలు లేవు. అలాంటిది ఇప్పుడు టీకాలు అందుబాటులోకి రావడంతో కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. ఆ ఫలాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఏమీ తెలియని స్థితి నుంచి..

గతంలో సార్స్‌, మెర్స్‌, డెంగీ వంటి వాటికి సరైనా టీకాలు అభివృద్ధి చేయలేకపోవడంతో ఈ సారి కూడా అదే పరిస్థితి తలెత్తుతుందని భావించారు. కానీ, నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆపరేషన్‌ రాప్‌ స్పీడ్‌ను ప్రారంభించారు. దీంతో మోడెర్నా, ఫైజర్ వంటి సంస్థలు అత్యంత వేగంగా ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా నడుం బిగించడంతో టీకా ప్రయోగాలు వేగవంతం అయ్యాయి. చైనాలో కూడా ముందే మొదలుపెట్టినా.. ఆద్యంతం అవి రహస్యంగానే సాగాయి. భారత్‌లో భారత్‌ బయోటెక్‌ సంస్థ కూడా శరవేగంగా ప్రయోగాలను చేపట్టింది. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడా రాజీపడకుండా సహకరించింది. అదే సమయంలో రష్యాలోని గమలేయ విశ్వవిద్యాలయం టీకాను తయారు చేసినట్లు ప్రకటించడం ఈ రేసును మలుపు తిప్పింది. వివిధ దశల ప్రయోగ ఫలితాలను బహిర్గతం చేయలేదు. అంతే కాదు.. చైనా, రష్యాలు అనధికారికంగానే వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టాయి.

మరోపక్క ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థ అమెరికాలో డిసెంబర్‌ 14న అత్యవసర అనుమతులు సాధించింది. ఆ తర్వాత మరోనాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు దేశాలు కూడా వ్యాక్సినేషన్‌ను శరవేగంగా మొదలు పెట్టాయి.

వ్యాక్సినేషన్‌ను ట్రాక్‌ చేస్తున్న 'అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా' ఏప్రిల్‌ 12 నాటి లెక్కల ప్రకారం పది లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్‌ అత్యధికంగా ప్రతి 100కి 118 డోస్‌లను(రెండు డోసులు లేదా షాట్‌లను కలిపితే ఒక టీకా లెక్కన) ఇచ్చింది. ఆ తర్వాత 91 డోసులతో యూఏఈ, 63 డోసులతో చిలీ, 59 డోసులతో యూకే, 55 డోసులతో బహ్రెయిన్‌, 55 డోసులతో అమెరికా, 42 డోసులతో సెర్బియా, 42 డోసులతో హంగేరీ,37 డోసులతో ఖతార్‌, 29 డోసులతో ఉరుగ్వేలు టాప్‌ టెన్‌లో ఉన్నాయి.

ఇజ్రాయెల్‌లో భారీగా తగ్గిన కేసులు

వ్యాక్సినేషన్‌ ఫలాలు ఇజ్రాయెల్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జనవరి 20వ తేదీన 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్‌ మొదలైన తొలినాళ్లలో కేసుల తీవ్రత పెరగడం వల్ల ఆ దేశం మరింత అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. ఏప్రిల్‌ 12 నాటికి దాదాపు 60శాతం మందికిపైగా వ్యాక్సిన్‌ డోస్ అందుకొన్నారు. ఆ దేశ జనాభా 90 లక్షలు. వీరిలో 8.30లక్షల మందికి గతంలోనే కొవిడ్‌ సోకడంతో యాంటీబాడీలు లభించాయి. దాదాపు 53లక్షల మందికి టీకాలు వేశారు. కొవిడ్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీకి 70శాతం మందిలో యాంటీ బాడీలు ఉంటే చాలన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంది. ఫలితంగా ఏప్రిల్‌ 13 నాటికి అక్కడి రోజువారీ కేసుల సంఖ్య 200 లోపునకు పడిపోయాయి.

  • టీకా విషయంలో ఇజ్రాయెల్‌ ముందుచూపును మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ డిసెంబర్‌ 19 నుంచే వ్యాక్సినేషన్‌ మొదలైంది. జనవరి 19 నాటికి అమెరికా ప్రజలు ఇంకా టీకాలు వేయించుకోవడానికి తటపటాయిస్తుంటే.. ఇజ్రాయెల్‌ మాత్రం 25శాతం ప్రజలకు ఓ డోసు టీకా వేసేసింది. మరో ఐదు లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసింది.
  • టీకాల కొనుగోలు విషయంలో ఇజ్రాయెల్ దూకుడుగానే ఉంది. 2020జూన్‌లోనే మోడెర్నా నుంచి టీకా కొనుగోలుకు ఒప్పందం చేసుకొంది. అదే ఏడాది నవంబర్‌లో అస్ట్రాజెనెకా, ఫైజర్లతో కూడా ఒప్పందం చేసుకొంది. ఇజ్రాయెల్‌ ప్రధాన విమానాశ్రయం వద్ద భూగర్భంలో 50లక్షల డోసుల నిల్వ సామర్థ్యం ఉన్న 30 భారీ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేసింది.

ఊపరి పీల్చుకొంటున్న యూకే..

కొవిడ్‌ కల్లోలానికి గురైన యూకే కూడా మెల్లగా ఊపరిపీల్చుకుంటోంది. ఇక్కడ కూడా ఏప్రిల్‌ 11 నాటికి కొవిడ్‌ టీకా డోసు తీసుకొన్న వారి శాతం 47కి చేరింది. దీంతో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. యూకేలో జనవరి 8న అత్యధికంగా 68వేలకుపైగా కేసులు నమోదుకాగా.. ఆ సంఖ్య ఏప్రిల్‌ 13 నాటికి 2,472కు తగ్గిపోయింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కొవిడ్‌ ఆంక్షలను మెల్లగా తొలగిస్తామని ఏప్రిల్‌ 5వ తేదీన ప్రకటించారు.

అమెరికాలో కూడా కేసులు తగ్గుముఖం..

అగ్రరాజ్యం అమెరికాలో కూడా వ్యాక్సినేషన్‌ జరిగే కొద్దీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. జనవరి 8వ తేదీన 3 లక్షలకు పైగా కేసులు నమోదైన ఈ దేశంలో ఏప్రిల్‌ 13 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 77 వేలకు తగ్గింది. అంకె పరంగా చూస్తే ఇది భారీగానే కనిపించవచ్చు.. కానీ, గతేడాది నవంబర్‌ రెండో వారం నుంచి జనవరి చివరి వరకు దాదాపు నిత్యం 1.50లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అందులో దాదాపు సగం మాత్రం రావడం అమెరికాకు కచ్చితంగా ఊరటనిచ్చే విషయమే. ఏప్రిల్‌12 నాటికి ఇక్కడ 36శాతం మంది టీకాలు వేయించుకొన్నారు.

భారత జనాభాలో మాత్రం టీకాలు పొందిన వారు ఏప్రిల్‌ 12 నాటికి 6.89శాతం మంది ('అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా' ప్రకారం)మాత్రమే ఉన్నారు. మనం హెర్డ్‌ ఇమ్యూనిటీ లక్ష్యానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అప్పటి వరకు మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతక దూరమే మనల్ని వైరస్‌ నుంచి రక్షిస్తాయి.

ఇదీ చదవండి : 'భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా నూతన విద్యా విధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.