దుబాయ్ ఎక్స్పో (Dubai Expo 2021).. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ అవకాశాలకు వేదిక అని.. అన్ని రంగాల అభివృద్ధికి, పెట్టుబడులకు సరైన దేశమని పేర్కొన్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో భారత్ పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
'భారత్ ప్రతిభకు ప్రధాన కేంద్రం. టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్‌కు సంబంధించి మా దేశం ఎన్నో ఘనతలను సాధిస్తోంది. దిగ్గజ పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మేళవింపే మా ఆర్థిక వృద్ధికి మూలం' అని అన్నారు మోదీ.
-
I call upon all those at the #Expo2020Dubai to visit the India Pavilion for a glimpse of India and to come to our nation to explore the countless avenues of economic and cultural cooperation. #IndiaAtDubaiExpo pic.twitter.com/oRqEzM0fgp
— Narendra Modi (@narendramodi) October 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I call upon all those at the #Expo2020Dubai to visit the India Pavilion for a glimpse of India and to come to our nation to explore the countless avenues of economic and cultural cooperation. #IndiaAtDubaiExpo pic.twitter.com/oRqEzM0fgp
— Narendra Modi (@narendramodi) October 1, 2021I call upon all those at the #Expo2020Dubai to visit the India Pavilion for a glimpse of India and to come to our nation to explore the countless avenues of economic and cultural cooperation. #IndiaAtDubaiExpo pic.twitter.com/oRqEzM0fgp
— Narendra Modi (@narendramodi) October 1, 2021
దుబాయ్ ఎక్స్పో శుక్రవారం ప్రారంభమైంది. గతేడాది నిర్వహించాల్సిన ఎక్స్పో రద్దు కావడం వల్ల దుబాయ్ ఎక్స్పో 2020ని ఇప్పుడు ప్రారంభించారు. 1080 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో 190కిపైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఎక్స్పో ఏర్పాటుకి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది.
ఇదీ చూడండి : 'నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛభారత్ 2.0 లక్ష్యం'