సూడాన్ పశ్చిమ డర్ఫూర్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశానికి చెందిన సైనిక రవాణా విమానం జనైనా విమానాశ్రయం నుంచి బయలుదేరిన 5 నిమిషాల తర్వాత కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
"జనైనా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆంటోనోవ్-12 సైనిక విమానం గురువారం రాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు న్యాయమూర్తులు, నలుగురు చిన్నారులతో సహా 8 మంది సిబ్బంది ఉన్నారు."
-అమేర్ మహ్మద్ అల్-హసన్, సైనిక ప్రతినిధి.
కొంతకాలంగా సూడాన్‌కు చెందిన చాలా విమానాలు సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణం వల్ల కుప్పకూలినట్లు మహ్మద్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్‌లో పేలిన మందుపాతర... జవాన్లకు గాయాలు