ETV Bharat / international

గల్ఫ్‌ జలాల్లో నౌకల హైజాక్‌ హెచ్చరికలు - బ్రిటన్‌ రక్షణ శాఖ నౌకల హెచ్చరికలు

గల్ఫ్‌ సముద్రప్రాంతం.. యూఏఈ తీరానికి కొంత దూరంలో నౌకలు హైజాక్‌కు గురికానున్నాయని హెచ్చరికలు కలకలం రేపాయి. బ్రిటీష్‌ నేవీ గ్రూప్‌ ఈ హెచ్చరికలు జారీచేసింది. అయితే వీటిని బ్రిటన్‌ రక్షణ శాఖ, ఎమరేట్‌ ప్రభుత్వం ధ్రువీకరించలేదు.

ship hijack
ship hijack
author img

By

Published : Aug 4, 2021, 5:56 AM IST

ఒమన్‌ గల్ఫ్‌లోని యూఏఈ సముద్ర తీరానికి కొంత దూరంలో నౌకలు హైజాక్‌కు గురికానున్నాయనే హెచ్చరికలు మంగళవారం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీశాయి. బ్రిటన్‌ సైన్యానికి చెందిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ తొలుత ఈ అప్రమత్తత హెచ్చరికను జారీచేసింది. దీనికి సంబంధించిన వివరాలను తొలుత వెల్లడించలేదు. ఆ తర్వాత మరో ప్రకటన చేస్తూ.. నౌకలు హైజాక్‌ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాత్రమే పేర్కొంది.

ఈ అంశంపై మధ్య ప్రాశ్చ్యంలో ఉన్న అమెరికా 5వ ఫ్లీట్‌, బ్రిటన్‌ రక్షణ శాఖ, ఎమిరేట్‌ ప్రభుత్వం ఏవీ కూడా స్పందించలేదు. హైజాక్‌ సంఘటనలను ధ్రువీకరించలేదు. అయితే, ఇది జరగటానికి కొంత ముందుగా యూఏఈ తీరానికి దూరంగా ఉన్న నాలుగు నౌకల నుంచి తాము ప్రమాదంలో ఉన్నామనే సంకేతాలు వెలువడ్డాయి. నౌకలపై నియంత్రణ కోల్పోయామని, ఈ ప్రాంతంలో అస్పష్టమైన పరిస్థితులేవో ఏర్పడుతున్నాయన్నది ఆ సందేశాల సారాంశం.

చమురు లోడుతో వెళుతున్న 'క్వీన్‌ ఇమతా, గోల్డెన్‌ బ్రిలియంట్‌, జగ్‌ పూజా, అబిస్‌...అనే నౌకల నుంచి ఈ సందేశాలు వెలువడ్డాయని' మెరైన్‌ ట్రాఫిక్‌.కామ్‌ తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.