ETV Bharat / international

గాజాపై దాడి- ఖండించిన అంతర్జాతీయ సమాజం

author img

By

Published : May 17, 2021, 9:53 PM IST

గాజాపై ఇజ్రాయెల్ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. మీడియా సంస్థలున్న భవనాన్ని ధ్వంసం చేయడం పట్ల రష్యా, ఐరోపా సమాఖ్య తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఇజ్రాయెల్, పాలస్తీనాలను ఈజిప్టు హెచ్చరించింది.

Britain calls on Israel to act proportionately
గాజాపై దాడిని ఖండించిన అంతర్జాతీయ సమాజం

గాజా నగరంలో పలు మీడియా సంస్థలున్న అతిపెద్ద భవంతిని ఇజ్రాయెల్ ధ్వంసం చేయడం పట్ల రష్యా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ దాడిలో మృతుల సంఖ్యపై విచారం వ్యక్తంచేశారు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్. ఇటీవలి కాలంలో ఇరు పక్షాలతోనూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ మాట్లాడలేదని, అయితే సమస్య పరిష్కారం కోసం సమావేశానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

వెంటనే ఆపాలి..

ఇజ్రాయెల్, పాలస్తీనా వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని ఈజిప్టు హెచ్చరించింది. ఇరు దేశాల సమస్యకు శాశ్వత, సమగ్ర, న్యాయమైన పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజంతో చర్చిస్తున్నట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి సామే శుక్రీ వెల్లడించారు. ఈ ప్రాంతంలో యుద్ధం, విధ్వంసాన్ని అంతం చేయడానికి అమెరికా ముందుకొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఆంక్షలకు మద్దతు..

ఇజ్రాయెల్​పై ఆంక్షలకు మద్దతివ్వాలని పోప్ ఫ్రాన్సిస్​కు విజ్ఞప్తిచేశారు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్​ను శిక్షించనంతకాలం పాలస్తీనియన్ల ఊచకోత కొనసాగుతుందని అన్నారు.

ఇజ్రాయెల్​కు మద్దతుగా..

అయితే, ఇజ్రాయెల్​పై హమాస్ రాకెట్ దాడులను జర్మనీ ఖండించింది. ప్రజలను ఇష్టమొచ్చినట్టు చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్ తన ప్రజలను కాపాడేందుకు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.

సహేతుకంగా ఉండాలి..

హమాస్​పై ఇజ్రాయెల్ మిలిటరీ చర్యలు సహేతుకంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. మీడియా భవంతి కూల్చివేత, గాజా పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై అమెరికా, ఐక్యరాజ్యసమితి దేశాలతో చర్చిస్తునట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికార ప్రతినిధి మ్యాక్స్ బ్లెయిన్ తెలిపారు.

ఈయూ ప్రయత్నాలు..

ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య తీవ్రమవుతున్న హింసాకాండను అంతమొందించడానికి తన ప్రయత్నాలను రెట్టింపు చేస్తునట్లు ఐరోపా సమాఖ్య తెలిపింది. మీడియా సంస్థలున్న భవంతి ధ్వంసంపై తీవ్ర విచారం వ్యక్తంచేసింది. పాత్రికేయులకు సురక్షిత పని వాతావరణం అవసరం అని పేర్కొంది.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​ భీకర దాడులు- 'ఉగ్ర సొరంగాలు' ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.