పాలస్తీనా నిరసనకారులకు, ఇజ్రాయెల్ పోలీసులుకు మధ్య శనివారం ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులను అడ్డుకోవడానికి అధికారులు స్మోక్ బాంబులను విసిరారు. రంజాన్ ప్రార్థనల కోసం జెరూసలెం వెళ్తున్న యాత్రికుల బస్సులను పోలీసులు అడ్డుకోవడం కారణంగా గొడవలు ఆజ్యం పోసుకున్నాయి. ఈ ఘర్షణల్లో సుమారు 200 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా వైద్యులు తెలిపారు.
అయితే పోలీసులు.. వారి చర్యలను సమర్థించుకున్నారు. కేవలం భద్రతాకారణాల వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. కానీ నిరసనకారుల వాదన మరోలా ఉంది. తమ మత స్వేచ్ఛను దెబ్బతీసేలా పోలీసులు ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనను అరబ్ మిత్రదేశాలు ఖండించాయి. ఇరువర్గాలు శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని ఐక్యరాజ్యసమితి, ఐరోపా కూటమి పిలుపునిచ్చాయి. అరబ్ లీగ్ సోమవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
జుడాయిజం, ఇస్లాం, క్రైస్తవ మతాలకు సంబంధించిన ప్రధాన పుణ్యక్షేత్రాలకు నిలయమైన తూర్పు జెరూసలెంలో ఇంతకు ముందు కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఇదీ చూడండి: సముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు!