ETV Bharat / international

ఇజ్రాయెల్​తో సయోధ్యకు మరో అరబ్ దేశం సై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో మరో దౌత్యపరమైన విజయం వచ్చి చేరింది. ఇజ్రాయెల్​తో సంబంధాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు బహ్రెయిన్ ముందుకొచ్చింది. ఈ ఒప్పందం ద్వారా యూఏఈ, ఈజిప్ట్, జోర్డాన్​ల తర్వాత ఇజ్రాయెల్​తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న నాలుగో అరబ్ దేశంగా బహ్రెయిన్ మారనుంది.

Bahrain becomes latest Arab nation to recognise Israel
ఇజ్రాయెల్​తో సయోధ్యకు మరో అరబ్ దేశం సై
author img

By

Published : Sep 12, 2020, 5:47 AM IST

ఇజ్రాయెల్​తో సంబంధాల పునరుద్ధరణకు మరో అరబ్ దేశం ముందుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఇజ్రాయెల్​తో సంబంధాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు బహ్రెయిన్ అంగీకరించింది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్​లో సంభాషించిన అనంతరం ఈ విషయాన్ని ట్రంప్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ముగ్గురు దేశాధినేతలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

2001 సెప్టెంబర్ 11న (9/11) ఉగ్రదాడులు జరిగి 19 ఏళ్లు అయిన సందర్భంగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఒప్పందంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 9/11 దాడులకు ఇంతకుమించి శక్తిమంతమైన సమాధానం ఇంకోటి ఉండదని పేర్కొన్నారు. ఇది మరో చారిత్రాత్మకమైన నిర్ణయమని అభివర్ణించారు.

యూఏఈ మాదిరిగానే

ఇజ్రాయెల్​తో సంబంధాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే యూఏఈ అంగీకారానికి వచ్చింది. తాజాగా బహ్రెయిన్ ఒప్పందంతో ట్రంప్​కు రోజుల వ్యవధిలో మరో దౌత్యపరమైన విజయం చేకూరినట్లయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండు నెలలు ఉన్న నేపథ్యంలో ఆయకు ఇది కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

యూఏఈ ఒప్పందం మాదిరిగానే.. బహ్రెయిన్-ఇజ్రాయెల్ డీల్ కూడా ఇరుదేశాల మధ్య దౌత్య, వాణిజ్య, రక్షణ సహా ఇతర సంబంధాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది. ఈ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్​తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న నాలుగో అరబ్ దేశంగా బహ్రెయిన్ మారనుంది.

72 ఏళ్లుగా రెండే

ఈ ఒప్పందంపై ట్రంప్ అల్లుడు, అమెరికా అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుడు జారెడ్ కుష్నర్ హర్షం వ్యక్తం చేశారు. 30 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్​తో రెండో అరబ్ దేశం ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం సాధించిన 72 ఏళ్ల తర్వాత కూడా రెండు అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్ దేశాలతో మాత్రమే శాంతి ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.