అమెరికా జరిపిన వైమానిక దాడిలో తమ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలేమనీ చనిపోవటంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతీకార దాడులు తప్పవని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ హెచ్చరించారు.
ఖాసీం సోలేమనీ..దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడని పార్సీ భాషలో ట్వీట్ చేశారు ఖమెనీ. దైవ సన్నిధికి చేరినా ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తామన్నారు. ఖాసీంతోపాటు మరికొందరు అమరుల రక్తంతో చేతులు తడుపుకున్న నేరస్థులు ప్రతీకార దాడికి సిద్ధంగా ఉండాలని ఖమెనీ స్పష్టం చేశారు. ఖాసీం మృతి పట్ల 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ఈ వార్త తెలిసిన వెంటనే ఇరాన్ ఉన్నతస్థాయి భద్రతా సంస్థ అత్యవసరంగా సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించింది.
ఇదీ చూడండి:'ట్రంప్ ఆదేశాల మేరకే ఇరాక్‌పై రాకెట్ దాడి'