కాబూల్‌లోని కార్తి సఖి ప్రార్థనా మందిరం పరిసర ప్రాంతాల్లో షైతే ప్రజలు అధికంగా నివసిస్తారు. ఏటా నౌరోజ్ పర్వదినాన సంప్రదాయంగా వేడుకలు జరుపుకుంటారు. ఆకుపచ్చ రంగు జెండాలను ఎగురవేసి, పూర్వీకులను స్మరించుకుంటారు. ఈ పర్షియన్ పండగను మధ్యప్రాచ్యంలో ఘనంగా చేసుకుంటారు.
వేడుకల్లో ఉగ్రవాదుల కదలికలపై ఇప్పటికే ప్రజలను అఫ్గాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటివరకూ ఘటనపై ఏ ఉగ్రసంస్థ స్పందించలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు షైతే ముస్లింలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. సున్నీ మిలిటెంట్ సంస్థలు షైతే ముస్లింలను మతవిరోధులుగా భావించటమే ఇందుకు కారణం.