ETV Bharat / international

మధ్యప్రాచ్యంలో భారీగా బలగాల మోహరింపు: అమెరికా

ఇరాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాల్లో మరిన్ని బలగాలను మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. 1,500 మంది రక్షణ బలగాలను గల్ఫ్​ దేశాలకు పంపే విషయమై కాంగ్రెస్​ సభ్యులకు సమాచారం అందించింది అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​.

మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలు
author img

By

Published : May 25, 2019, 7:47 AM IST

మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలు

ఇరాన్​తో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని పెంచేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గల్ఫ్ ​దేశాల్లో అదనంగా 1,500 మంది రక్షణ బలగాలను మోహరించేందుకు గురువారం నిర్ణయం తీసుకుంది పెంటగాన్​. ఈ విషయమై అమెరికా చట్ట సభ కాంగ్రెస్​కు సమాచారం అందించింది.

ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 10వేల మంది సైనికులను పంపించాలన్న ప్రణాళికలు ఉన్నా ఇంకా తుది నిర్ణయానికి రాలేదని రక్షణ విభాగ కార్యదర్శి ప్యాట్రిక్​ షానన్​ తెలిపారు.

రక్షణ బృందాల్లో ఓ గస్తీ విమానం, యుద్ధ విమానాలు, ఇంజినీర్లు, 600 మంది రక్షణ సిబ్బంది కలిగిన క్షిపణి రక్షక వ్యవస్థ ఉండనున్నాయి.
ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన ఇరాన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం... గల్ఫ్ ప్రాంతంలో బలగాలను మోహరించాలని నిర్ణయం తీసుకుంది.

New Delhi, May 24 (ANI): Prime Minister Narendra Modi met President Ram Nath Kovind in the national capital today. PM Modi tendered his resignation to Ram Nath Kovind along with the Council of Ministers. The President has accepted the resignation and has requested PM Narendra Modi and the Council of Ministers to continue till the new Government assumes office.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.