ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు.ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలెమన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు ఇరాక్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.
అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి జరిగిన కొద్ది రోజుల అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ ఉద్యమకారులకు మద్దతుగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో గత నెల 31న ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే బాగ్దాద్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేశారు ఆందోళనకారులు.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధానికి 'కార్చిచ్చు' సెగ- బాధితుల ఆగ్రహం