ETV Bharat / international

అఫ్గాన్​ సైన్యం దాడిలో 50 మంది తాలిబన్లు హతం

అఫ్గాన్ ​భద్రతా బలగాలు తాలిబన్ల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సైన్యం.. తాలిబన్లపై శుక్రవారం రాత్రి దాడి జరిపింది. ఈ ఘటనలో 50 మంది ముష్కరులు హతమయ్యారు.

50 taliban dead
అఫ్గాన్​ సైన్యం దాడిలో 50 మంది తాలిబన్లు హతం
author img

By

Published : Jan 2, 2021, 9:30 PM IST

తాలిబన్లపై అఫ్గానిస్థాన్​​ భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 50 మంది హతమయ్యారు. హెల్మండ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దాడులు జరిపినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని లష్కర్​ఘా, గరాంసిర్, నావా జిల్లాల్లోని తాలిబన్లు తలదాచుకునే ప్రాంతాలను గుర్తించామని తెలిపింది.

సాయుధుల్లో 50 మందిని హతమార్చామని, 8 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన వివరాలను అఫ్గాన్​ సైన్యాధికారి నవాబ్​ షా జాద్రాన్ వెల్లడించారు. నావా, నాద్​ అలీ, గరాంసిర్ జిల్లాలు సహా రాష్ట్ర రాజధాని అయిన లష్కర్​ఘాలో శుక్రవారం రాత్రి దాడులు జరిపామన్నారు.

పథకం పన్నారు.. అందుకే..

రక్షణ బలగాలపై దాడులు జరిపేందుకు తాలిబన్లు పథకం పన్నారని నవాబ్​ షా తెలిపారు. సాయుధులకు కమాండర్​గా ఉన్న మువాల్వీ అబ్దుల్ సలాం కూడా మృతుల్లో ఉన్నాడని వెల్లడించారు. ఈ ఘటనపై తాలిబన్లు ఇంకా స్పందించలేదు.

ఇదీ చూడండి : 45 మంది ఉన్న బస్సును అపహరించిన తాలిబన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.