యెమెన్లో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకర ఘర్షణలు(Yemen Clashes) జరుగుతున్నాయి. మరిబ్ రాష్ట్రంలో రెండు రోజులుగా జరిగిన దాడుల్లో(Yemen Clashes) దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరు పక్షాలకు చెందిన భద్రతా అధికారులు(Yemen News) గురువారం తెలిపారు.
మృతుల్లో చాలా మంది హౌతీ దళాలకు చెందిన వారే ఉన్నారు. మరీబ్ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ప్రభుత్వ వర్గాలతో ఇటీవల వారు ఘర్షణకు దిగారు. ఈ మేరకు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని అధికారులు.. మీడియాకు తెలిపారు. ఈ ఘర్షణల్లో వందలాది మంది గాయపడ్డారని చెప్పారు.
దాడులు ఎందుకు?
2014లో ఇరాన్ మద్దతుతో హౌతీలు(Yemen News) రాజధాని సనాను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్లో అంతర్యుద్ధం (Yemen Civil War) మొదలైంది. సనా సహా దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియాకు తరలిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది.
హౌతీ స్థావరాలపై అనేక సార్లు వైమానిక దాడులు జరిపింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో యెమెన్లో తీవ్రమైన మానవతా సంక్షోభం (Yemen Humanitarian Crisis) ఏర్పడింది.
ఇవీ చూడండి: