ETV Bharat / international

భారత సంతతి బాలుడికి గిన్నిస్​ బుక్​లో చోటు - Gulf News

దుబాయ్​లోని భారత సంతతికి చెందిన బుడతడు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. ఒకే నిమిషంలో 39 విమాన సర్వీసు సంస్థల చిహ్నాలను గుర్తించి ఔరా అనిపించాడు.

12-yr-old Indian in Guinness World Record for identifying most aeroplane tails in UAE
భారత సంతతి చిన్నారికి గిన్నీస్​ బుక్​లో చోటు
author img

By

Published : Dec 25, 2020, 6:21 AM IST

దుబాయ్​లోని భారత సంతతికి చెందిన 12ఏళ్ల సిద్ధాంత్​ గుంబర్​ ​ గిన్నిస్​ బుక్ ఆఫ్​ వర్డల్​ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. కేవలం ఒకే నిమిషంలో 39 విమాన సర్వీసు సంస్థల చిహ్నాలను గుర్తించి ఔరా అనిపించాడు. చకచకా చెప్పి గిన్నిస్​ బుక్​లో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

హరియాణాకు చెందిన గుంబర్​ గతంలో 'ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​'లో చోటు సంపాదించాడు. ఇంతకుముందు.. అతి చిన్న వయసులోనే ప్రపంచంలోని అతిపెద్ద భవంతులను, వాటి ప్రదేశాలను గుర్తుంచుకొని చెప్పడం విశేషం. ఇటీవల జరిగిన 'ఎయిర్​ప్లేన్​ టైల్​' క్విజ్​తో గిన్నిస్​ బుక్​లోకి ఎక్కాడు.

"వివిధ రకాల సంజ్ఞలను గుర్తించడం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. ఇందుకు అమ్మానాన్న సహకరించారు. ఇందుకు ప్రత్యేకించి నాన్న రకరకాల గుర్తులను రూపొందించేవారు. రాకెట్లు, భవనాలు, వాహనాలు ఇలా చాలానే చూపించేవారు. ఈ విధంగానే విమాన సంస్థల చిహ్నాలను గుర్తించగలిగాను."

-సిద్ధాంత్​ గుంబర్​​

ఇదీ చూడండి: కరోనా టీకా వేయడానికి సిద్ధంగా ఉన్నాం: కేజ్రీవాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.