ETV Bharat / international

World Largest Restaurant : 900 టేబుళ్లు.. ఒకేసారి 5,800 మంది భోజనం.. 24 గంటలు ఓపెన్​! - చైనా పిపా యువాన్ రెస్టారెంట్

World Largest Restaurant : ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ గురించి మీకు తెలుసా? దాని ప్రత్యేకతలేంటో తెలుసా? ఇక్కడ ఎన్ని టేబుళ్లు, ఒకేసారి ఎంత మంది భోజనం చేయోచ్చో తెలుసా? ఇప్పుడు ఆ రెస్టారెంట్ వివరాలు తెలుసుకుందాం.

worlds-largest-restaurant-pipa-yuan-can-accommodate-5800-at-a-time
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్
author img

By

Published : Jul 2, 2023, 12:07 PM IST

Pipa Yuan Restaurant China : పిపా యువాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్​. ఇది చైనాలోని నాన్ జిల్లా చాంగ్‌కింగ్ నగర శివార్లలోని కొండ ప్రాంతాల్లో ఉంది ఈ రెస్టారెంట్​. దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. వంటకాలను రుచి చూస్తే వాహ్​ అనాల్సిందే. ఈ రెస్టారెంట్​లో మొత్తం 900 పైగా టేబుళ్లు ఉన్నాయి. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెస్టారెంట్​లో 5,800 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు. 2022లో గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లోనూ చోటు సంపాదించింది ఈ రెస్టారెంట్​.

చైనాలోని పాపులర్​ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్​లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు, ఛెఫ్​లు ఉంటారు. వీరితో పాటు 25 మంది క్యాషియర్స్ కూడా ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్​ తెరిచే ఉంటుంది. రాత్రి సమయంలోనూ ఈ రెస్టారెంట్​కు వస్తుంటారు కస్టమర్​లు. ఆ సమయంలో వివిధ రకాల విద్యుత్​ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణం.

బుక్​ చేసుకున్న టేబుళ్లను కస్టమర్​లకు చూపించేందుకు ఇక్కడ ప్రత్యేకంగా కొంత మంది సిబ్బంది కూడా ఉంటారు. ఆర్డర్​ ఇచ్చిన డిష్​ కోసం కస్టమర్​ల దాదాపుగా అరగంట సేపు ఆగాల్సిందే. రోజు రోజుకి ఈ రెస్టారెంట్​కు వచ్చే వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇక వేసవి కాలంలో రిజర్వేషన్ లేకుండా ఇక్కడి వస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సిందే. ఆ​ సీజన్​లో​​ ఇక్కడ టేబుల్​ దొరకడమే కష్టంగా ఉంటుంది. విపరీతంగా వచ్చే ప్రజలతో.. ఈ రెస్టారెంట్​ జాతరను తలపిస్తూ ఉంటుంది. ఈ రెస్టారెంట్​కు ఇంతమంది కస్టమర్​లు వస్తుంటే.. అక్కడున్న సిబ్బంది ఆర్డ​ర్​లను రుచిగా ఇస్తారా లేదా అన్న అనుమానం మనకు కలగవచ్చు. కానీ ఇక్కడికి ఎంత మంది వచ్చిన రుచికరమైన ఆహారం అందిస్తారు రెస్టారెంట్​ సిబ్బంది. కస్టమర్​ల నుంచి కూడా ఈ రెస్టారెంట్​ మంచి స్పందనే వస్తోంది.

'రాక్షస్​', '53'.. సిటీలో కేఫ్​ల​ నేమ్స్​ వెరీ క్రేజీ​ గురూ.. భలే వింతగా ఉన్నాయిగా!
'రాక్షస్'​, '53', 'పోర్టుశ్'​​.. వీటిని చదువుతుంటే ఇవేవో సినిమా పేర్లు లాగా అనిపిస్తున్నాయి కదా. కానీ వాస్తవానికి ఇవన్నీ రెస్టారెంట్​ పేర్లు. బిహార్​ పట్నా వీధుల్లో తిరిగే ప్రజలకు ఇలాంటి బోర్డులు విరివిగా కనిపిస్తాయి. కమ్మనైన ఆహారాన్ని కోరుకునే ఫుడ్​ లవర్స్​ను మరింత అట్రాక్ట్​ చేసేందుకు అక్కడి కేఫ్​ యజమానులు తమ షాపులకు విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.