ETV Bharat / international

వికీపీడియాలో ఇండియన్ పేజీల హవా! సినిమాలు, క్రికెట్​పై ఇంట్రెస్ట్- ఎక్కువ వ్యూస్ మాత్రం దానికే! - 2023లోఎక్కువపేజ్​​వ్యూస్​​సాధించినవికీపీడియాకథనాలు

Wikipedia Top 25 Report : ప్రముఖ ఉచిత కంటెంట్ ప్లాట్​ఫామ్ వికీపీడియా ద్వారా ఈ ఏడాది అత్యధిక పేజ్​వ్యూస్​ సంపాదించిన ఆర్టికల్స్​కి సంబంధించిన జాబితాను విడుదల చేసింది వికీమీడియా ఫౌండేషన్. ఆ వివరాలు..

Wikipedia Top Searches 2023
Wikipedia Top 25 Report
author img

By PTI

Published : Dec 6, 2023, 10:34 AM IST

Updated : Dec 6, 2023, 11:56 AM IST

Wikipedia Top 25 Report : ప్రముఖ ఆన్​లైన్ ఎన్​సైక్లోపీడియా ప్లాట్​ఫామ్​ వికీపీడియాలో ఈ ఏడాది అత్యధిక వ్యూస్ సాధించిన పేజీల వివరాలను వికీమీడియా ఫౌండేషన్ వెల్లడించింది. ఈ మేరకు వార్షిక నివేదిక విడుదల చేసిన ఆ సంస్థ- ఇంగ్లిష్ వికీపీడియా ఈ ఏడాది 8,400 కోట్ల వ్యూస్ సాధించినట్లు తెలిపింది. అత్యధికంగా చాట్​జీపీటీ పేజీని నెటిజన్లు వీక్షించారని వివరించింది. ఏఐ చాట్​బాట్​ ChatGPT 49,490,406 పేజ్​ వ్యూస్​తో తొలి స్థానంలో నిలవగా రెండో స్థానంలో 2023లో సంభవించిన మరణాలకు సంబంధించి సమాచారాన్ని వినియోగదారులు ఎక్కువగా అన్వేషించారు.

కాగా, అత్యధిక మంది వీక్షించిన పేజీల జాబితాలో భారత్​కు చెందిన అంశాలు సైతం ఉన్నాయి. క్రికెట్, బాలీవుడ్ సినిమాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. 'ఇండియా' పేజీని సైతం అత్యధిక మంది వీక్షించారు. ఏ పేజీని ఈ ఏడాది అత్యధికంగా వీక్షించారంటే?

Wikipedia Top Searches 2023 :
వికీపీడియాలో ఈ ఏడాది అత్యధిక పేజ్​ వ్యూస్​ సాధించిన ఆర్టికల్స్​ ఇవే..

1. చాట్​జీపీటీ- 49,490,406 పేజ్​ వ్యూస్​

2. 2023లో మరణాలు- 42,666,860 పేజ్​ వ్యూస్​

3. 2023 క్రికెట్​ వరల్డ్​ కప్​- 38,171,653 పేజ్​ వ్యూస్​

4. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​- 32,012,810 పేజ్​ వ్యూస్​

5. ఓపెన్​హైమర్​(మూవీ)- 28,348,248 పేజ్​ వ్యూస్​

6. క్రికెట్​ వరల్డ్​ కప్​- 25,961,417

7. జే.రాబర్ట్​ ఓపెన్​హైమర్- 25,672,469

8. జవాన్​(హిందీ మూవీ)- 21,791,126

9. 2023 ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​- 20,694,974

10. పఠాన్​(​హిందీ మూవీ)- 19,932,509

11. ది లాస్ట్ ఆఫ్​ యూఎస్​(టీవీ సిరీస్​)- 19,791,789

12. టేలర్​ స్విఫ్ట్​- 19,418,385

13. బార్బీ(మూవీ)- 18,051,077

14. క్రిస్టియానో రొనాల్డో- 17,492,537

15. లియోనెల్​ మెస్సీ- 16,623,630

16. ప్రీమియర్​ లీగ్​- 16,604,669

17. మాథ్యూ పెర్రీ- 16,454,666

18. యునైటెడ్​ స్టేట్స్​- 16,240,461

19. ఎలాన్​ మస్క్​- 14,370,395

20. అవతార్​ : ది వే ఆఫ్​ వాటర్​- 14,303,116

21. ఇండియా- 13,850,178

22. లిసా మ్యారీ ప్రెస్లే- 13,764,007

23. గార్డియన్స్​ ఆఫ్​ ది గెలాక్సి Vol. 3- 13,392,917

24. రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం- 12,798,866

25. ఆండ్రూ టేట్​- 12,728,616

తొలిసారి లిస్ట్​లో క్రికెట్​..!
క్రికెట్​కు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఫ్యాన్స్​ ఉంటారు. కానీ, ఇప్పటివరకు వికీమీడియా రిపోర్ట్​లో క్రికెట్​కు సంబంధించిన ఆర్టికల్స్​కు మాత్రం స్థానం దక్కలేదు. అయితే ఈసారి భిన్నంగా 16 శాతం పేజ్​ వ్యూస్​తో 2023 జాబితాలో ఏకంగా మూడో స్థానంలో నిలిచింది క్రికెట్​. ఈసారి ఈ మెగా టోర్నీకి భారత్​ ఆతిథ్యమివ్వడం కారణంగా చెప్పవచ్చు. మొత్తంగా క్రికెట్​ వరల్డ్​ కప్, 2023 ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ఆర్టికల్స్​ వీక్షకులను కలుపుకొని మొత్తం 11.68 కోట్ల పేజ్​ వ్యూస్​ వచ్చాయి.

ఒక్క ఆర్టికల్​ కోసం 2.65 లక్షల మంది..
వికీపీడియా ఆన్​లైన్​ కంటెంట్​ ప్లాట్​ఫామ్​ను వికీమీడియా ఫౌండేషన్​ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. దీనిని 2015లో ప్రారంభించారు. దీని ద్వారా ప్రతిఒక్కరూ తమకు కావాల్సిన సమస్త సమాచారాన్ని ఉచితంగా తెలుసుకోవచ్చు. ప్రారంభించిన తొలి ఏడాది నుంచే ఇలా అత్యధిక పేజ్​ వ్యూస్​ సాధించిన ఆర్టికల్స్ గురించి రిపోర్ట్​ను ప్రచురిస్తూ వస్తోంది వికీమీడియా. ఒక వికీపీడియా ఆర్టికల్​ తయారు కావాలంటే దానికోసం కనీసం 2 లక్షల 65 వేల మంది వలంటీర్లు పనిచేస్తారు. వీరే సమాచారాన్ని సేకరిస్తారు, క్రోడికరిస్తారు, పబ్లిష్​ చేస్తారు, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఎడిట్​ చేస్తారు. ఈ కథనాలు నిర్వహణ మొత్తం వీరే చూసుకుంటారు.

మళ్లీ పేలిన ఇండోనేసియా అగ్నిపర్వతం- 23కు చేరిన మృతుల సంఖ్య

ఖాన్‌ యూనిస్‌ రక్తసిక్తం- భారీగా బాంబు దాడులు- సొరంగాల్లో నీళ్లు నింపుతున్న ఇజ్రాయెల్!

Last Updated : Dec 6, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.