ETV Bharat / international

వ్యాక్సిన్ తీసుకున్నాక ఒమిక్రాన్ సోకినా నో ప్రాబ్లమ్​..!

author img

By

Published : Sep 2, 2022, 3:31 PM IST

Omicron variant: టీకా పూర్తయ్యాక ఒమిక్రాన్ మొదటి వేరియంట్​లు సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి బాగా వృద్ధి చెందుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. టీకా తీసుకుని ఒమిక్రాన్ సోకని వారితో పోలిస్తే.. వ్యాధి సోకిన వారిలో నాలుగు రెట్లు రక్షణ ఉంటుందని తెలిపింది.

omicron variant covid
ఒమిక్రాన్ వేరియంట్

omicron variant: కొవిడ్ టీకా వేసుకున్న తర్వాత ఒమిక్రాన్​ మొదటి వేరియంట్​లు బీఏ.1, బీఏ2 సోకినవారికి వ్యాధి నిరోధకశక్తి వృద్ధి చెందుతుందని ఓ అధ్యయనం తెలిపింది. టీకా వేసుకుని ఒమిక్రాన్ మొదటి వేరియంట్ సోకని వారితో పోలిస్తే.. టీకా వేసుకున్న వారిలో నాలుగు రెట్లు రక్షణ అధికంగా ఉంటుందని అమెరికాకు చెందిన న్యూ ఇండియా జర్నల్ ఆఫ్ మెడిసిన్​లో ప్రచురితమైంది. వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందడం వల్ల ఒమిక్రాన్ ఉప వేరియంట్​లు సోకే ప్రమాదం తక్కువని అధ్యయనంలో తెలిపారు.

టీకాలు వేసుకుని ఒమిక్రాన్​ బీఏ.1, బీఏ.2 వేరియంట్​లు బారినపడినవారికి తదుపరి వేరియంట్​ బీఏ5 నుంచి హాని తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. పోర్చుగల్​లో పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. దేశంలోని 12 ఏళ్లు దాటిన కొవిడ్ బాధితుల నమూనాలను అధ్యయనం కోసం తీసుకున్నామని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్​ కాక.. అంతకుముందు వచ్చిన సార్స్ 2 కొవిడ్ వైరస్​పై కూడా పరిశోధనలో ప్రామాణికంగా తీసుకున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: ఎన్నికల ఫ్రాడ్​ కేసులో సూకీకి మూడేళ్ల జైలు శిక్ష.. శ్రీలంకకు గొటబాయ రాజపక్స!

జీతాల కోసం పైలట్ల బంద్​.. నిలిచిన 800 విమానాలు.. దిల్లీలో ప్రయాణికుల తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.