US shooting: అమెరికా సాక్రమెంటోలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న శబ్దం వినిపిస్తుండగా.. అనేక మంది ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారు, కారణాలేంటో ఇంకా తెలియలేదు.
ఆ ప్రాంతంలో కర్ఫ్యూ తరహా నిబంధనలు విధించారు. అయితే ఈ కాల్పులకు తెగబడింది ఒకే దుండగుడా? లేక మరికొందరు ఉన్నారా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ స్థానికులను దూరంగా వెళ్లాలని పోలీసులు కోరారు. కాల్పుల శబ్దం విన్న సమయంలో కొద్దరు శరీరంపై రక్తంతో పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: శ్రీలంకలో సోషల్ మీడియా బంద్.. ప్రధాని తనయుడి 'వీపీఎన్' సెటైర్!