ETV Bharat / international

అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన అమెరికా నిఘా విమానం- నీటిలో తేలుతూ! - పీ 8ఏ క్రాష్​

US Plane Crash Into Sea : అమెరికాకు చెందిన ఓ భారీ నిఘా విమానం ప్రమాదవశాత్తు అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. రన్‌వే నుంచి గగనతలంలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.

Plane Overshoots Runway P 8A CRASH
US Plane Crash Today
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 12:25 PM IST

US Plane Crash Into Sea : అగ్రరాజ్యం అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ(P-8A) భారీ నిఘా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి గగనతలంలోకి ఎగిసిన కొద్దిసేపటికే అదుపు తప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అమెరికా హవాయీ రాష్ట్రంలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో ఈ ప్రమాదం జరిగినట్లుగా కోర్‌ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్‌ ధ్రువీకరించారు.

US Plane Crash Into Sea
సముద్రంపై తేలుతున్న అమెరికా నిఘా విమానం

P 8A Crash : ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించడం వల్ల ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సముద్రంలో బోటింగ్‌ చేస్తున్నవారు ఈ విమానం నీటిపై తేలడాన్ని చూసి ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉందని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

US Plane Crash Into Sea
సముద్రంలోకి దూసుకెళ్లిన P-8A నిఘా విమానం

భారత సైన్యం కూడా P-8Aను..
అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్‌ విమానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సబ్‌మెరైన్లను గాలించి వాటిపై దాడులు చేయగలదు. అంతేకాకుండా భారీగా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను కూడా ఈ విమానం సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్‌ క్షిపణులను సైతం P-8A తీసుకెళ్లగలదు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో అనే విషయాన్న మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా, ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్‌ స్క్వాడ్రన్‌.. కనోహె బే కేంద్రంగా పనిచేస్తుంది. మెరైన్‌ కోర్‌ ప్రధాన స్థావరం కూడా హవాయీ రాష్ట్రంలోనే ఉంది. ఇక ప్రపంచంలో ఈ తరహా(పీ8) విమానాలను భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌, నార్వే సైన్యాలు కూడా వినియోగిస్తున్నాయి.

  • 🇺🇸 US Navy plane overshoots runway and ends up in a bay in Hawaii

    The P-8A "Poseidon" overshot the runway at a Marine base on Kaneohe Bay, said U.S. Marine Corps Spox Gunnery Sgt. Orlando Perez said that all nine people on board the aircraft made it safely to shore@DlugajJuly pic.twitter.com/ltXxVgpvCU

    — Velerie (@velerie_a) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
2009లో కూడా అమెరికాలో ఓ భారీ విమానం హడ్సన్‌ నది మధ్యలో నీటిపై ల్యాండ్​ అయింది. అయితే పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అప్పట్లో ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.

విషాదం- సొరంగం కూలి 9 మంది మృతి- రంగంలోకి అత్యవసర బృందాలు

బంగారు గని కూలి 10 మంది మృతి- అక్రమంగా తవ్వకాలు చేపడుతుండగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.