ETV Bharat / international

భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్​పై 7.2 తీవ్రత.. సునామీ వార్నింగ్! - అమెరికా భూకంపం న్యూస్​

US earthquake today : అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్​పై దీని తీవ్రత 7.2గా నమోదైంది. అలాస్కా ద్వీపకల్పంలో ఈ ఘటన జరిగింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.. కాసేపటి తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు.

us earthquake today
అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం
author img

By

Published : Jul 16, 2023, 2:50 PM IST

Updated : Jul 16, 2023, 4:41 PM IST

US earthquake today : అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్పంలో శనివారం రాత్రి 10:48 గంటలకు భూమి కంపించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్‌ స్కేల్​పై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్లు వెల్లడించింది. అలాస్కాలోని సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 106 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూకంపం ధాటికి అలాస్కా ద్వీపకల్పంతోపాటు అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఎటువంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

విపత్తు తీవ్రత భారీగానే ఉందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ తెలిపింది. కొడియాక్, అలాస్కా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. దీంతో అక్కడి ప్రజలందరిని రాత్రికి రాత్రే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకుంది వాతావరణ శాఖ. మరోవైపు షిషల్డిన్‌ అగ్నిపర్వతం బద్ధలయ్యే అవకాశాలున్నట్లు అలాస్కా వల్కనో అబ్జర్వేటరీ హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెదజల్లినట్లు పేర్కొంది. ఇప్పుడే భూకంపం ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని అత్యవసర విభాగం స్థానికులకు సూచించింది. అధికారుల సమ్మతితోనే తిరిగి అక్కడికి వెళ్లాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ద్వీపాలకు ఎటువంటి ముప్పులేదని తెలిపిన అధికారులు.. ఇప్పటికీ సముద్రంలో స్వల్ప మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

భూకంపం వేళ మహిళకు డెలివరీ.. ఆస్పత్రి మొత్తం షేక్ అయిపోతున్నా..
కొంతకాలం క్రితం.. భూకంప సమయంలో ఓ మహిళకు ప్రసవం చేశారు వైద్యులు. భయానక పరిస్థితుల్లో ఓ బిడ్డకు ప్రాణం పోశారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ చిన్నారికి జీవితాన్ని ప్రసాదించారు. జమ్ముకశ్మీర్​లో ఈ సంఘటన జరిగింది. అనంత్​నాగ్​ జిల్లాలోని బిజ్​బెహారా ఎస్​డీఎచ్​ ఆసుపత్రి వైద్యులు.. సిజేరియన్​ చేసి చిన్నారిని డెలివరీ చేశారు.

డాక్టర్ల కృషిని అభినందిస్తూ జిల్లా వైద్యాధికారి​ అప్పట్లో ఓ ట్వీట్​ చేశారు. విజయవంతంగా మహిళకు ప్రసవం చేసినందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భూకంపం సమయంలోనూ మహిళకు సిజేయరియన్​ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చుట్టూ వస్తువులు, వైద్య పరికరాలు కదలడం.. ఈ వీడియోలో మనం గమనించవచ్చు. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Jul 16, 2023, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.