ETV Bharat / international

US Aid To Gaza : గాజాకు అమెరికా రూ.832కోట్ల సాయం.. 10లక్షల మంది ప్రజలకు అండగా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 10:41 PM IST

US Aid To Gaza : ఇజ్రాయెల్‌ సైన్యం-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధంతో తీవ్ర మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న గాజాకు అమెరికా భారీ సాయాన్ని ప్రకటించింది. 10లక్షల మందికి పైగా ప్రజలకు, యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన సాయం ఉపయోగపడుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్​ తెలిపారు.

US Aid To Gaza
US Aid To Gaza

US Aid To Gaza : ఇజ్రాయెల్‌ సైన్యం-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరుతో గాజా ప్రాంతంలో తీవ్ర మానవతా సంక్షోభం తలెత్తింది. తినడానికి తిండి, తాగేందుకు నీరు సైతం లేక గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనా ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్‌ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహుతో భేటీ తర్వాత.. బైడెన్‌ ఈ ప్రకటన చేశారు.

  • I just announced $100 million for humanitarian assistance in Gaza and the West Bank.

    This money will support over 1 million displaced and conflict-affected Palestinians.

    And we will have mechanisms in place so this aid reaches those in need – not Hamas or terrorist groups.

    — President Biden (@POTUS) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

10లక్షల మందికి పైగా ప్రజలకు..
America Aid To Gaza : ఇజ్రాయెల్​- హమాస్​ మధ్య భీకర పోరు నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన 10 లక్షల మందికి పైగా ప్రజలకు, యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన ఈ సాయం ఉపయోగపడుతుందని బైడెన్‌ పేర్కొన్నారు. హమాస్ లేదా ఇతర తీవ్రవాద సంస్థలకు కాకుండా అవసరమైన ప్రజలకు ఈ సాయం చేరేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

  • Let me make myself clear:

    The vast majority of Palestinians are not Hamas.

    And Hamas does not represent the Palestinian people.

ఇజ్రాయెల్‌కు అండగా..
Biden Israel Visit : అయితే తాను ఒక సందేశంతోనే ఇజ్రాయెల్‌కు వెళ్లానని.. ఆ దేశం ఒంటరి కాదంటూ అంతకుముందు మరో ట్వీట్‌ చేశారు. అమెరికా ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. మెజారిటీ పాలస్తీనా ప్రజలకు హమాస్‌తో అసలు సంబంధం లేదని పేర్కొన్నారు. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడికి కారణం ఇజ్రాయెల్​ సైన్యం కాదని తెలుస్తోందని అన్నారు.

  • I have come to Israel with a simple message:

    You are not alone.

    As long as the United States stands – and we will stand forever – you will not be alone.

    — President Biden (@POTUS) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="

I have come to Israel with a simple message:

You are not alone.

As long as the United States stands – and we will stand forever – you will not be alone.

— President Biden (@POTUS) October 18, 2023 ">

మలాలా రూ.2.5 కోట్ల సాయం
Malala Aid To Gaza : గాజా ఆస్పత్రిపై రాకెట్‌ దాడి జరగడం పట్ల నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా రూ.2.5 కోట్ల సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "గాజాలోని అల్‌-అహ్లి ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిని చూసి నేను భయపడ్డాను. ఆ చర్యను నిస్సందేహంగా ఖండిస్తున్నాను. ఇజ్రాయెల్, పాలస్తీనా, ప్రపంచవ్యాప్తంగా శాంతినెలకొనాలని కోరుకుంటున్న ప్రజలతో నేనూ గొంతు కలుపుతున్నాను. సామూహిక శిక్ష పరిష్కారం కాదు. గాజాలోని నివసిస్తున్న జనాభాలో సగం మంది 18 సంవత్సరాలలోపు వయసున్న వారే. వారు తమ జీవితాంతం బాంబు దాడుల మధ్య ఉండకూడదు" అని మలాలా తెలిపారు.

  • I’m horrified to see the bombing of al-Ahli Hospital in Gaza and unequivocally condemn it. I urge the Israeli government to allow humanitarian aid into Gaza and reiterate the call for a ceasefire. I am directing $300K to three charities helping Palestinian people under attack. pic.twitter.com/JiIPfnTUvY

    — Malala Yousafzai (@Malala) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈజిప్టునకు అనుమతి
Gaza Egypt Border Open : గాజా స్ట్రిప్‌కు మానవతా సహాయాన్ని అందించేందుకు ఈజిప్టును అనుమతించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్​ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్లు ప్రధానమంత్రి నెతన్యాహు కార్యాలయం తెలిపింది. హమాస్​కు సాయంగా ఈజిప్ట్.. ఆహారం, నీరు, ఔషధాల తరలింపునకు ఇజ్రాయెల్​ అడ్డుపడదని పేర్కొంది. అయితే ఈజిప్ట్​ తన సాయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుందో స్పష్టత లేదు.

ఐరాసలో తీర్మానం.. అమెరికా వీటో
Resolution UN Israel Gaza : గాజా స్ట్రిప్‌కు మానవతా సహాయాన్ని అనుమతించడానికి, ఇజ్రాయెల్- హమాస్ మధ్య వివాదానికి విరామం ఇవ్వడానికి పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. దీంతో బ్రెజిల్ నేతృత్వంలోని ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించడంలో UN భద్రతా మండలి బుధవారం విఫలమైంది. కౌన్సిల్ అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రెజిల్ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఓటు వేయడానికి 15 దేశాల కౌన్సిల్ సమావేశమైంది. 12 మంది కౌన్సిల్ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. రష్యా , బ్రిటన్ గైర్హాజరయ్యాయి. US వీటో కారణంగా తీర్మానం వీగిపోయింది. పశ్చిమాసియాలో పరిస్థితిపై తీర్మానాన్ని ఆమోదించడంలో కౌన్సిల్ విఫలమవ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి.

Biden Israel : 'గాజా ఆస్పత్రిలో పేలుడు.. ఇజ్రాయెల్​ పనికాదు.. వేరే ఎవరో'.. నెతన్యాహుతో బైడెన్

US Sanctions On Hamas : హమాస్​పై అమెరికా కన్నెర్ర.. 10మంది సభ్యులపై ఆంక్షలు.. ఇక ఆ నిధులు బంద్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.