ETV Bharat / international

రష్యన్ పెట్రోలింగ్ బోట్​లను ధ్వంసం చేసిన కీవ్​ - ఉక్రెయిన్ రష్యా వార్తలు

Ukraine Russia News: తమ డ్రోన్‌లు నల్ల సముద్రంలో రెండు రష్యన్ పెట్రోలింగ్ బోట్‌లను ధ్వంసం చేశాయని కీవ్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఏరియల్ వీడియో ఫుటేజీనీ విడుదల చేసింది.

ukraine-says-it-destroyed-russian-patrol-boats-in-black-sea
నల్ల సముద్రంలో రష్యాకు మరో దెబ్బ
author img

By

Published : May 2, 2022, 10:24 PM IST

UKraine Russi War: ఉక్రెయిన్‌ భూభాగంపైనే కాకుండా నల్ల సముద్రంలోనూ రష్యాకు కీవ్‌ బలగాల నుంచి చుక్కెదురవుతోంది. తాజాగా తమ డ్రోన్‌లు నల్ల సముద్రంలో రెండు రష్యన్ పెట్రోలింగ్ బోట్‌లను ధ్వంసం చేశాయని కీవ్‌ ప్రకటించింది. స్నేక్ ఐలాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రెండు రష్యన్ రాప్టర్ పడవలను నీటముంచినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ సామాజిక మాధ్యమాల్లో తెలిపింది. దీనికి సంబంధించిన ఏరియల్ వీడియో ఫుటేజీనీ విడుదల చేసింది. బేరక్టార్‌లు బాగా పనిచేస్తున్నాయని ఉక్రెయిన్‌ సాయుధ దళాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ వాలెరీ జాలుజ్ని.. టర్కీలో తయారయిన అటాక్ డ్రోన్లను ప్రస్తావిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

రష్యా రాప్టర్ పెట్రోలింగ్ బోట్‌లలో ముగ్గురు సిబ్బందితోపాటు 20 మంది వరకు ప్రయాణించవచ్చు. వాటికి మెషిన్ గన్‌లు అమర్చి ఉంటాయి. నిఘా, ల్యాండింగ్ కార్యకలాపాల్లో వీటిని వినియోగిస్తారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నల్ల సముద్రంలో రష్యా యుద్ధ నౌక మాస్క్‌వా సైతం ఉక్రెయిన్‌ దాడుల్లో ధ్వంసమై, నీటమునిగిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన నౌకాదళ యుద్ధానికి ఇది నేతృత్వం వహించింది. మరోవైపు.. ఇప్పటివరకు వెయ్యికిపైగా రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. 23,800 మంది సైనికులను హతమార్చినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ల్యాప్​టాప్​ లేక ప్రధాని ప్రోగ్రామ్​ లైవ్​ ఇవ్వలేకపోయారట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.