ETV Bharat / international

'ఉక్రెయిన్‌ను రెండుగా విభజించేందుకు పుతిన్‌ కుట్ర'

Ukraine Crisis: తమ దేశాన్ని రెండుగా విభజించేందుకు రష్యా కుట్ర పన్నిందని ఉక్రెయిన్‌ సైనిక నిఘా విభాగాధిపతి కిరిలో బుదనోవ్‌ ఆరోపించారు. అందుకే రష్యా ఆక్రమిత నగరాల్లో మా ప్రభుత్వానికి సమాంతరంగా వేరే ప్రభుత్వాలను ఏర్పాటుచేసేందుకు యత్నిస్తుండటం.. అక్కడి ప్రజలు ఉక్రెయిన్‌ కరెన్సీని వినియోగించకుండా నిషేధాజ్ఞలు విధిస్తుండటం వంటివి ఇందుకు నిదర్శనాలని తెలిపారు.

Ukraine
ఉక్రెయిన్​
author img

By

Published : Mar 28, 2022, 8:28 AM IST

Ukraine Crisis: తమ దేశాన్ని రెండుగా విభజించేందుకు రష్యా కుట్ర పన్నిందని ఉక్రెయిన్‌ సైనిక నిఘా విభాగాధిపతి కిరిలో బుదనోవ్‌ ఆరోపించారు. "ఉక్రెయిన్‌ మొత్తాన్ని తన వశం చేసుకోవడం సాధ్యం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు తెలిసొచ్చింది. అందుకే- మా దేశాన్ని కొరియా తరహాలో రెండు భాగాలుగా విభజించేందుకు ఆయన ప్రయత్నించే అవకాశముంది. అలా అవతరించే రెండు భాగాల్లో ఒకదాన్ని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవాలన్నది ఆయన యోచన. రష్యా ఆక్రమిత నగరాల్లో మా ప్రభుత్వానికి సమాంతరంగా వేరే ప్రభుత్వాలను ఏర్పాటుచేసేందుకు యత్నిస్తుండటం.. అక్కడి ప్రజలు ఉక్రెయిన్‌ కరెన్సీని వినియోగించకుండా నిషేధాజ్ఞలు విధిస్తుండటం వంటివి ఇందుకు నిదర్శనాలు" అని బుదనోవ్‌ ఆదివారం పేర్కొన్నారు. రష్యా కుట్రను ఛేదించేందుకు ఆ దేశ బలగాలపై తాము పూర్తిగా గెరిల్లా తరహా దాడులకు పాల్పడే అవకాశముందని చెప్పారు.

త్వరలో లుహాన్స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ!

రష్యాలో విలీనమయ్యే అంశంపై తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌లో త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరిపే అవకాశాలున్నట్లు ఆ ప్రాంత వేర్పాటువాద నేత లియోనిద్‌ పాసెచ్నిక్‌ ఆదివారం తెలిపారు. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌తో పాటు దొనెట్స్క్‌ ప్రాంతాల్లో వేర్పాటువాదులకు రష్యా దీర్ఘకాలంగా మద్దతిస్తోంది. ఈ రెండింటిని స్వతంత్ర ప్రాంతాలుగా పుతిన్‌ గత నెల 21న గుర్తించింది.

ఇదీ చదవండి: యుద్ధ రంగంలోకి బెలారస్‌.. రష్యాతో కలిసి ఉక్రెయిన్​పై దాడులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.