ETV Bharat / international

ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్​?

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్​ఎస్​సీ)లో భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా చేయడానికి ఫ్రాన్స్‌ మరోమారు తన మద్దతును ప్రకటించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలు గురించి తెలిపింది.

uk-reaffirm-support-for-india-as-permanent-member-in-unsc

author img

By

Published : Nov 19, 2022, 2:25 PM IST

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్​ఎస్​సీ)లో భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా చేయడానికి ఫ్రాన్స్‌ మరోమారు తన మద్దతును ప్రకటించింది. భారత్‌తో పాటు జర్మనీ, బ్రెజిల్‌, జపాన్‌ దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరింది. యూఎన్​ఎస్​సీ అధికారాలు, ప్రాధాన్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త వారిని చేర్చుకోవాలని ఐరాసలోని ఫ్రాన్స్‌ శాశ్వత ప్రతినిధి నటాలీ బ్రాడ్​హర్ట్స్ అన్నారు.

యూఎన్​ఎస్​సీ శాశ్వత బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న భారత్‌ వంటి దేశాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆయా దేశాలతో పాటు ఐరాస భద్రతామండలిలో ఆఫ్రికన్‌ దేశాల ఉనికిని కోరుకుంటున్నట్లు చెప్పారు. అటు బ్రిటన్‌ సైతం యూఎన్​ఎస్​సీలో భారత్‌ సహా జర్మనీ, జపాన్‌, బ్రెజిల్‌ చేరికలకు గట్టి మద్దతు తెలిపింది. శాశ్వత..శాశ్వతేతర దేశాల సంఖ్యను పెంచాలని ఐరాసను కోరింది. ఈ మార్పులతో ఐరాస భద్రతా మండలి మరింత సమర్థవంతంగా పనిచేయలగల్గుతుందని యూఎన్​ఎస్​సీ బ్రిటన్‌ ప్రతినిధి బార్బరా ఉడ్‌వార్డ్ అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉండగా.. చైనా మినహా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌, రష్యా భారత్‌కు మద్దతు మద్దతు ప్రకటించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.