UAE President dies: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ (73) మరణించారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్ష వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రజలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఆయన మృతి నేపథ్యంలో 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు శుక్రవారం నుంచే మూసి ఉంటాయని తెలిపింది.
1948లో జన్మించారు షేక్ ఖలీఫా. యూఏఈకి రెండో ప్రధానిగా 2004 నవంబర్ 3న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అబుదాబి పాలకుడిగా ఉంటున్నారు. అంతకుముందు ఆయన తండ్రి షేక్ జయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఈ పదవుల్లో ఉన్నారు. 2004 నవంబర్లో బిన్ సుల్తాన్ మరణించగా.. అనంతరం షేక్ ఖలీఫా బాధ్యతలు స్వీకరించారు.
అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఫెడరల్ ప్రభుత్వంతో పాటు అబుదాబి ప్రభుత్వ పునర్నిర్మానం కోసం పనిచేశారు ఖలీఫా. ఈయన హయాంలో యూఏఈ అభివృద్ధి గణనీయంగా పుంజుకుంది. ప్రజలకు కనీస వసతులు అందేలా కృషి జరిగింది.
ఇదీ చదవండి: