ETV Bharat / international

ట్విట్టర్​లో వన్​వర్డ్ ట్రెండ్.. సచిన్​, బైడెన్ ఏం ట్వీట్​ చేశారంటే? - అమెరికాలోని రైలు సేవల సంస్థ ఆమ్‌ట్రాక్

Twitter One Word Trend: ట్విట్టర్​లో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండింగ్​లో ఉంటుంది. ప్రస్తుతం ట్విట్టర్​లో వన్​ వర్డ్​ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైనా యూజర్ ఒకే పదాన్ని ట్వీట్ చేయడమే వన్ వర్డ్ ట్రెండ్. ప్రముఖ క్రికెటర్ సచిన్​, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇందులో చేరిపోయారు.

twitter one word trend
వన్‌ వర్డ్‌ ట్రెండ్‌
author img

By

Published : Sep 3, 2022, 3:40 PM IST

Twitter One Word Trend: ప్రముఖ సామాజిక మాధ్యమం 'ట్విట్టర్​’లో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండింగ్‌లో ఉంటుంది. సాధారణ నెటిజన్ల మొదలు ప్రముఖ సంస్థలు, సెలెబ్రిటీల వరకు ఇందులో భాగమవుతారు! ఈ క్రమంలోనే ట్విట్టర్​లో తాజాగా వన్‌ వర్డ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అంటే.. ఎవరైనా యూజర్‌ కేవలం ఒకే పదాన్ని ట్వీట్‌ చేయడం అన్నమాట. ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ సైతం ఇందులో చేరిపోయారు. శుక్రవారం ఆయన 'క్రికెట్‌' అనే పదాన్ని పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం 'డెమోక్రసీ(ప్రజాస్వామ్యం)' అనే పదాన్ని ట్వీట్‌ చేశారు.

అసలు ఎలా మొదలైంది..
అమెరికాలోని రైలు సేవల సంస్థ 'ఆమ్‌ట్రాక్' సోషల్‌ మీడియా టీం.. తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో గురువారం 'ట్రైన్స్' అని ఒక పదాన్ని పోస్ట్‌ చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక్కడినుంచే వన్‌ వర్డ్‌ ట్రెండింగ్‌ మొదలైనట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు లక్షన్నరకుపైగా లైక్స్‌ రావడం గమనార్హం. క్రమంగా ప్రముఖ సంస్థలతోపాటు వ్యక్తులూ ఈ ట్రెండింగ్‌లో భాగస్వాములవుతున్నారు.

twitter one word trend
ట్విట్టర్​లో వన్​వర్డ్ ట్రెండ్

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. 'యూనివర్స్‌' అని ట్వీట్‌ చేసింది. వాషింగ్టన్‌ పోస్ట్‌.. 'న్యూస్' అని పోస్ట్‌ చేసింది. అయితే.. 'ట్రైన్స్‌' అనే ట్వీట్‌ను ఆమ్‌ట్రాక్ సోషల్ మీడియా టీమ్‌లోని ఓ ఇంటర్న్ చేసిన పొరపాటుగా చాలా మంది భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. సోషల్‌ మీడియా యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు ఉద్దేశపూర్వకంగా అమలు చేసిన వ్యూహమని నమ్ముతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ట్విట్టర్​లో నయా ట్రెండింగ్‌ హవా సాగుతోంది.

twitter one word trend
ట్విట్టర్​లో వన్​వర్డ్ ట్రెండ్

ఇవీ చదవండి: పోలీసు వాహనంపై దాడి.. 8 మంది మృతి.. నది దాటుతూ మరో ఎనిమిది మంది

సొంతగడ్డపై కాలుమోపిన గొటబాయ.. 50 రోజుల తర్వాత శ్రీలంకకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.