ETV Bharat / international

'టైటాన్​​'​ సబ్​మెరైన్​ కథ విషాదాంతం.. ఐదుగురు పర్యటకులు మరణించినట్లు ప్రకటన - టైటానికి జలాంతర్గామి వార్తలు

Titanic Tourist Submarine : టైటానిక్ నౌక శకలాలను చూడడానికి వెళ్లిన పర్యాటక సబ్​మెరైన్​ కథ విషాదాంతమైంది. సముద్రగర్భంలో ఒత్తిడి పెరగడం వల్ల ఆ జలంతర్గామి పేలిపోయిందని అమెరికా కోస్ట్​గార్డ్​ ప్రకటించింది.

Titanic Tourist Submarine
Titanic Tourist Submarine
author img

By

Published : Jun 23, 2023, 6:32 AM IST

Updated : Jun 23, 2023, 7:02 AM IST

Titanic Submarine Missing : టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి.. గల్లంతైన మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి పెరగడం వల్ల 'టైటాన్‌' పేలిపోవడం వల్ల అందులో ఉన్న ఐదుగురు పర్యటకులు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వాహనం సహాయంతో మినీ సబ్​మెరైన్​ శకలాలను గుర్తించామని.. టైటానిక్‌ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని వెంటనే బాధితుల కుటుంబాలకు తెలియజేసినట్లు రియర్‌ అడ్మిరల్‌ జాన్‌ మౌగర్‌ తెలిపారు. యూఎస్‌ కోస్ట్‌ గార్డ్‌, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు టైటాన్‌ మినీ సబ్​మెరైన్​లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఓషన్‌గేట్‌ సంస్థ పేర్కొంది.

Ocean Gate Titanic Submarine : ''టైటాన్​ సబ్​మెరైన్​ ఉన్న ఐదుగురు వ్యక్తులు నిజమైన అన్వేషకులు. మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగిఉన్నారు. ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే మా ఆలోచనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనకు చింతిస్తున్నాం'' అని ఓషన్‌ గేట్‌ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

Titanic Submarine Passengers :అట్లాంటిక్‌ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్​ నౌక శకలాలను చూసేందుకు.. గత ఆదివారం ఐదుగురు పర్యటకులతో న్యూఫౌండ్​ల్యాండ్​ నుంచి టైటాన్​ మీనీ సబ్​మెరైన్​ బయలుదేరింది. అందులో పాకిస్థాన్‌కు చెందిన బిలియనీర్‌ షెహజాదా దావూద్‌ (48), ఆయన కుమారుడు సులేమాన్‌ (19), యూఏఈలో ఉంటున్న బ్రిటన్ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఫ్రెంచ్‌ మాజీ నేవీ అధికారి పాల్‌ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ ఉన్నారు.
మూడు రోజుల నుంచి ఈ జలాంతర్గామి ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో కెనడా, అమెరికా కోస్ట్​గార్డ్​ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. మరోవైపు ఈ మినీ టైటాన్‌ సబ్​మెరైన్​లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలే ఉండడం వల్ల ప్రతిక్షణం ఉత్కంఠగా మారింది.

Titanic Submarine Update : భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 7.15 గంటలవరకే ఆక్సిజన్‌ నిల్వలు సరిపోతాయని నిపుణులు అంచనా వేశారు. రెండు రోజుల నుంచి టూరిస్ట్​ సబ్​మెరైన్​ గల్లంతైన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లు యూఎస్ కోస్ట్‌గార్డ్‌ తెలిపింది. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలింపు చేపట్టినప్పట్టారు. అయినా గల్లంతైన జలాంతర్గామి జాడ దొరకలేదు. అయితే జాలాంతర్గామి గల్లంతైన ప్రాంతంలో వినిపించిన శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవి కావని తర్వాత తెలిపింది. గురువారం సాయంత్రం రిమోట్‌ ఆపరేటేడ్‌ వెహికల్‌(ROV) సాయంతో.. టైటానిక్‌ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా తీర రక్షణ దళం ప్రకటన విడుదల చేసింది.

Last Updated : Jun 23, 2023, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.