Titanic Submarine Missing : అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన ఓ మినీ జలాంతర్గామి గాలింపు చర్యల్లో కీలక ముందడుగు పడింది. కెనడాకు చెందిన పెట్రోలింగ్ విమానం పీ-3.. నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది. విమానంలోని సోనార్ వ్యవస్థ శబ్దాలు గుర్తించిన నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలను రీలొకేట్ చేశారు. గురువారం తెల్లవారుజాము నాటికి మాత్రమే జలాంతర్గామిలో సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రక్షక దళాలు విరామం లేకుండా జలాంతర్గామి కోసం గాలిస్తున్నాయి.
-
Additionally, the data from the P-3 aircraft has been shared with our U.S. Navy experts for further analysis which will be considered in future search plans. 2/2 #Titanic
— USCGNortheast (@USCGNortheast) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Additionally, the data from the P-3 aircraft has been shared with our U.S. Navy experts for further analysis which will be considered in future search plans. 2/2 #Titanic
— USCGNortheast (@USCGNortheast) June 21, 2023Additionally, the data from the P-3 aircraft has been shared with our U.S. Navy experts for further analysis which will be considered in future search plans. 2/2 #Titanic
— USCGNortheast (@USCGNortheast) June 21, 2023
అసలేం జరిగిందంటే..
8 రోజుల సాహస యాత్రలో భాగంగా టైటానిక్ శకలాలను చూసేందుకు బిలియనీర్లు హమీష్ హార్డింగ్, బ్రిటిష్- పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19)తో పాటు మరో ఇద్దరు సముద్ర గర్భానికి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సాగరంలో ప్రవేశించిన గంటా 45 నిమిషాల్లోనే సబ్‌మెరైన్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాన్ని గాలించేందుకు అమెరికా, కెనడాలు పెట్రోలింగ్ విమానాలు, నౌకలను రంగంలోకి దించాయి. మునిగిన ఆ జలాంతర్గామిలో మొత్తం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది. 10,432 కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.

క్షేమంగా తిరిగి రావాలి..
బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్ ప్రమాదం నుంచి బయటపడాలని ఆయన శ్రేయాభిలాషులు, స్నేహితులు ప్రార్థించారు. షాజాదా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఆ సంస్థ.. పాకిస్థాన్‌లో ఎరువులు, వాహన, ఇంధన, డిజిటల్ టెక్నాలజీలో భారీగా పెట్టుబడులు పెట్టింది.

మునిగిన మినీ జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ హమీష్ హార్డింగ్ ఉన్నట్లు ఆయన కంపెనీ యాక్షన్ ఏవియేషన్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా తెలుస్తోంది. గతంలో హమీష్ ఈ భూమిపై ఉన్న సముద్ర గర్భాల్లో అత్యంత లోతైన ప్రదేశమైన పసిఫిక్‌లోని 'ది ఛాలెంజర్ డీప్'ను సందర్శించిన తొలిబృందంలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2022లో బ్లూఆరిజిన్ స్పేస్ ఫ్లైట్‌లో కూడా ఆయన సభ్యుడు. ఆయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.

Titanic Submarine Tour : టైటానిక్ శకలాలు చూపించేలా ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ యాత్ర టికెట్ ధర రూ. 2 కోట్లు ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ మినీ జలాంతర్గామిలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్నాయని ఓషన్ గేట్ కంపెనీ చెబుతోంది.

1912లో మంచుకొండను ఢీకొట్టి టైటానిక్ నౌక అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 2,200 మంది ప్రయాణికులు, 700 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ శకలాలను తొలిసారి 1985లో గుర్తించారు. వాటిని చూసేందుకు 2021లో కొందరు పర్యాటకులు లక్ష నుంచి లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్రగర్భంలోకి వెళ్లారు. తాజా యాత్రలో ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల డాలర్ల వరకూ ఓషన్‌గేట్ సంస్థ వసూలు చేసినట్లు తెలుస్తోంది.