Thailand Ayutthaya Temple : థాయ్‌లాండ్‌లోని అయుతయ ప్రాంతాన్ని అయోధ్యగా పిలుస్తారు. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాదు.. చరిత్రలో కూడా ఈ రెండు ప్రదేశాల మధ్య కొన్ని దగ్గరి పోలికలున్నాయి. అయుతయ రాజవంశంలోని ప్రతి రాజునూ శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సంప్రదాయం. రామాయణంలో అయోధ్య రాముని రాజధానిగా పేర్కొన్నారు. అయితే సయామీ పాలకుల కాలంలో అయుతయాని కూడా రాజధానిగా ప్రస్తావించారు.
-
#WATCH | Thailand: Visuals from 'Ayutthaya', the city named after the ancient Indian city of Ayodhya.
— ANI (@ANI) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Here is a dynasty, every king of which is considered to be an incarnation of Ram. (29.11) pic.twitter.com/vpdzZ5IdJg
">#WATCH | Thailand: Visuals from 'Ayutthaya', the city named after the ancient Indian city of Ayodhya.
— ANI (@ANI) November 29, 2023
Here is a dynasty, every king of which is considered to be an incarnation of Ram. (29.11) pic.twitter.com/vpdzZ5IdJg#WATCH | Thailand: Visuals from 'Ayutthaya', the city named after the ancient Indian city of Ayodhya.
— ANI (@ANI) November 29, 2023
Here is a dynasty, every king of which is considered to be an incarnation of Ram. (29.11) pic.twitter.com/vpdzZ5IdJg
క్రీస్తు శకం 1351 నుంచి సయామీ పాలకుల రాజధానిగా ఉన్న అయుతయను.. 1767లో బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. హిందూ ఇతిహాసాల్లోని రామాయణంలాగే థాయ్‌లాండ్ రామాయణం పేరు రామకియాన్. దీన్ని 18వ శతాబ్దంలో.. కింగ్ రామ ఒన్ రచించారని నమ్ముతారు. ఈ గ్రంథం గురించి 300 రామాయణం అనే పుస్తకంలో వాల్మీకి రాసిన రామాయణంతో పోల్చారు. రామాయాణంలోని రావాణాసురుడిలాగే ఈ పుస్తకంలోని ప్రత్యర్థి పేరు థోత్సకన్. మనం శ్రీరామ్‌గా ఆరాధించే పేరును థాయ్ వాసులు ఫ్రారామ్‌గా ఆరాధిస్తారు. ప్రస్తుతం అయుతయ నగరాన్ని యునెస్కో గుర్తించి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.
థాయ్‌లాండ్‌లో ఉన్న అయోధ్య గురించి వివరించారు అక్కడ 22 ఏళ్లుగా ఓ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ సురేశ్ పాల్ గిరి. థాయ్‌లాండ్‌లో గత కొద్దికాలంగా బౌద్ధ మతంలోని ఆచారాలు హిందూ మతంలోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. 'భారత్‌లోని అయోధ్య, థాయ్‌లాండ్‌లోని అయోధ్య మధ్య సారూప్యత ఉంది. భారతీయులు సంప్రదాయాలను, సంస్కృతిని మరిచిపోలేదు. అలాగే తరతరాలుగా శ్రీరాముడిని నమ్ముతున్నారు. అదే విధంగా థాయ్‌లాండ్‌లో కూడా శ్రీరాముడ్ని ఆరాధిస్తున్నారు. ఇక్కడ రాజు ఆయుతయ నగరంలో నగరానికి 35 కి.మీ దూరంలో విష్ణువు, బ్రహ్మ, శివుని ఆలయాలను నిర్మించారు.' అని సురేశ్ పాల్ గిరి చెప్పారు.
-
#WATCH | Thailand: Dr. Suresh Pal Giri, a teacher in Thailand who has been teaching for 22 years said, "I teach in a religious university in Thailand. The land on which you are standing is a part of the missing link of India. For some years, it was called Thailand, it was… pic.twitter.com/fVNuISlD6p
— ANI (@ANI) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Thailand: Dr. Suresh Pal Giri, a teacher in Thailand who has been teaching for 22 years said, "I teach in a religious university in Thailand. The land on which you are standing is a part of the missing link of India. For some years, it was called Thailand, it was… pic.twitter.com/fVNuISlD6p
— ANI (@ANI) November 29, 2023#WATCH | Thailand: Dr. Suresh Pal Giri, a teacher in Thailand who has been teaching for 22 years said, "I teach in a religious university in Thailand. The land on which you are standing is a part of the missing link of India. For some years, it was called Thailand, it was… pic.twitter.com/fVNuISlD6p
— ANI (@ANI) November 29, 2023
Ayodhya Ram Mandir Opening Date : భారత్‌లో అయోధ్య రామమందిర ప్రాణపతిష్ఠ వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.