ETV Bharat / international

బ్రేకప్​ రివెంజ్.. ప్రేయసి ముఖంపై తన పేరును టాటూగా వేసిన ఉన్మాది - ప్రియురాలి కిడ్నాప్​

తనకు బ్రేకప్​ చెప్పిందనే కోపంతో ఓ యువకుడు తన ప్రేయసిపై సైకోయిజాన్ని చూపించాడు. తనను కాదన్నదని కిడ్నాప్​ చేసి ఆమె ముఖంపై పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరును టాటూగా వేశాడు. ఈ సంఘటన బ్రెజిల్​లోని సావోపాలోలో వెలుగు చూసింది. యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

tattooing his name on girlfriend face
ప్రేయసి ముఖంపై తన పేరును టాటూగా వేసిన యువకుడు
author img

By

Published : Jun 5, 2022, 4:38 PM IST

తనకు బ్రేకప్​ చెప్పిందనే కోపంతో ఓ యువకుడు తన ప్రేయసిని కిడ్నాప్​ చేశాడు. తన పేరును ఆమె ముఖంపై టాటూగా వేసి సైకోయిజాన్ని చూపించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన బ్రెజిల్​లో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది: బ్రెజిల్​లోని సావోపాలోకు చెందిన తయానే కాల్డాస్​(18) అనే యువతి కొద్ది రోజుల క్రితం పాఠశాలకు వెళ్తుండగా ఆమె మాజీ ప్రియుడు గాబ్రియెల్​ కోయెల్హో(20) అడ్డగించాడు. బలవంతంగా తన కారులోకి ఎక్కుంచుకిని ఎక్కి తౌబాటే మున్సిపాలిటీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె ముఖంపై.. చెవి దగ్గరి నుంచి నోటి కింద వరకు బుగ్గపై తన పేరును టాటూ వేశాడు. తాను పచ్చబొట్టు వేసినందుకు తయానే సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

tattooing his name on girlfriend face
తయానే కాల్డాస్​ ముఖంపై టాటూ

ఆ మరుసటి రోజు తయానే తల్లి తన కుమార్తె కనిపించటం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గాబ్రియెల్​ ఇంట్లో యువతిని పోలీసులు గుర్తించారు. కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిన తల్లి ధైర్యం చెప్పి.. ఆమె మాజీ ప్రియుడిపై ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించారు. నిందితుడు గాబ్రియెల్​ కోయెల్హోను శనివారం తమ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు.. తన కుమారుడు చేసిన పనిని సమర్థించుకున్నారు నిందితుడి తండ్రి. ముఖంపై పేరును పచ్చబొట్టుగా వేసేందుకు తయానే సంతోషంగా అంగీకరించిందని పోలీసులతో చెప్పారు.

తన మాజీ ప్రియుడిని చూసి ఎంతో భయపడినట్లు చెప్పింది బాధితురాలు తయానే. 'అతడిని చూసి చాలా భయపడ్డాను. ఈరోజుల్లో ఉన్న చట్టాల వల్ల అతను ఎక్కువ రోజులు జైలులో ఉండడనేది అందరికి తెలిసిందే. ఈ పరిస్థితులను చూస్తే నాకు చాలా భయమేస్తోంది.' అని పేర్కొంది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా ఆమెకు సాయం చేసేందుకు బ్రెజిల్​లోని పలువురు కార్యకర్తలు, టాటూ తొలగించే దుకాణదారులు ముందుకు వచ్చారు. గత బుధవారం టాటూను తొలగించుకునేదుకు లేజర్​ చికిత్సకు హాజరయ్యారు తయానే. తన శరీరంపై మాజీ ప్రియుడి పేరుతో ఉన్న మరో రెండు టాటూలను సైతం తొలగించుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది ఆమె.

తయానే, గాబ్రియెల్​ మధ్య 2019లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు డేటింగ్​లో ఉన్నారు. ఏడాది తర్వాత వారి మధ్యలో గొడవలు ప్రారంభమయ్యాయి. టాటూ ఆర్టిస్ట్​ అయిన గాబ్రియెల్​ కొయెల్హో తన ప్రేయసిని వేధించటం ప్రారంభించాడు. దీంతో అతడిని వదిలేయాలన్న తల్లి సలహాతో.. అతడికి బ్రేకప్​ చేప్పేసింది. తనను ఎప్పుడూ బాధపెట్టని ప్రియుడు హామీ ఇవ్వగా.. ఎనిమిది నెలల తర్వాత మళ్లీ కలిశారు. కానీ, తన మాట నిలబెట్టుకోలేదు. దీంతో మళ్లీ బ్రేకప్​ చెప్పేసింది. కొన్నిరోజులు సావోపాలోకు పంపించారు కుటుంబ సభ్యులు. కానీ, తౌబాటే​కు వచ్చిన క్రమంలో మళ్లీ వేధించటం మొదలు పెట్టాడు ప్రియుడు.

ఇదీ చూడండి: నీటిలో నుంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప.. ఊపిరాడక బాధితుడు విలవిల

సముద్రాన్ని ఈది బంగ్లాదేశ్​ నుంచి భారత్​కు.. ప్రియుడి కోసం యువతి సాహసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.