ETV Bharat / international

అఫ్గాన్​లో బ్యూటీ సెలూన్లు బ్యాన్.. మహిళల అణచివేతకు తాలిబన్ల మరో నిర్ణయం - ఆఫ్గానిస్థాన్ బ్యూటీ సెలూన్​లపై నిషేధం

Taliban Govt Ban Beauty Parlours : అఫ్గానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి హక్కులను కాలరాసే విధంగా తాలిబన్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా అక్కడి మహిళల బ్యూటీ సెలూన్​లపై నిషేధం విధించింది.

Talban Govt Ban Beauty Parlours
ఆఫ్గాన్​లో మహిళల బ్యూటీ సెలూన్లు నిషేధం
author img

By

Published : Jul 5, 2023, 8:41 AM IST

Updated : Jul 5, 2023, 9:23 AM IST

Taliban Govt Ban Beauty Parlours : అఫ్గానిస్థాన్​లో మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించింది అక్కడి తాలిబన్​ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మహిళల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం పట్ల దేశ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం లీడర్ హిబాతుల్లా అఖుంజాదా జారీ చేసిన జూన్ 24 నాటి ఉత్తర్వులను.. తాలిబన్ మంత్రి సిద్దిఖ్ అకిఫ్ మజహర్ ధ్రువీకరించారు. అఫ్గానిస్థాన్ ప్రభుత్వం.. మహిళలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కొద్ది రోజుల కిందట అఖుంజాద పేర్కొన్నారు. ఆ ప్రకటన విడుదలైన కొద్ది రోజులకే ఈ నిషేధం అమలుకానుంది. కాగా అక్కడ ఇప్పటికే పార్కుల్లో, జిమ్​ల్లోకి మహిళలు వెళ్లకుండా ఆంక్షలు ఉన్నాయి.

నెల రోజులు డెడ్​లైన్..
అఫ్గాన్ రాజధాని నగరం కాబుల్​ సహా అన్ని ప్రాంతాల్లో సెలూన్లను మూసివేయడానికి ఒక నెల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నెల గడువు తర్వాత కచ్చితంగా సెలూన్లను మూసివేసి.. సంబంధిత నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని హెచ్చరించింది. కానీ బ్యాన్​కు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇలాంటి పరిమితులు మహిళల హక్కులు హరించడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై స్థానిక మహిళలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

"2017లో నా భర్త బాంబుదాడిలో మరణించాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ నేనే చూసుకుంటున్నాను. రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు మంది మహిళలు నా సెలూన్​కు వస్తుంటారు. ఇప్పుడు సెలూన్ మూసివేస్తే.. ఎలా బతికేది. ఈ తాలిబన్ ప్రభుత్వం రోజు రోజుకు మహిళలపై పరిమితులు విధిస్తోంది. ఎందుకు వీరు మహిళలనే లక్ష్యంగా చేసుకున్నారు? మేము మనుషులం కాదా? మాకు పని చేసే హక్కు, బతికే హక్కు లేదా?"
-ఓ బ్యూటీ సెలూన్ యజమానురాలు

"దేశంలో చాలా వరకు మగవారికి ఉద్యోగాలు లేవు. కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళలు బయటకు రావాల్సి వస్తోంది. ఇప్పుడు సెలూన్లపై నిషేధం విధిస్తే మేం ఏం చేయాలి?" అని మేకప్‌ ఆర్టిస్టు రైహాన్ ముబారిజ్ ప్రశ్నించారు.
కాగా, అఫ్గానిస్థాన్​ను 2021 ఆగస్ట్​లో తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. అప్పటినుంచి దేశంలో అరాచకాలు ఎక్కువవుతున్నాయని.. వారి నిర్ణయాలు దేశాన్ని నాశనం చేసేవిధంగా ఉండకూడదని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jul 5, 2023, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.