Syrian Soldiers Killed : లెబనాన్ రాజధాని బేరూట్‌లో సిరియా సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన. ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Syria Soldier Bus Incident : బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ.. ఈ ఘటనలో 23 మంది సిరియా సైనికులు మరణించారని, 10 మంది గాయపడ్డారని తెలిపింది. మరోవైపు, తూర్పు సిరియాకు చెందిన వ్యక్తి.. ఈ దాడిలో 20 మంది సైనికులు మరణించారని తెలిపారు.
ఐఎస్ఐఎస్ ఆధీనం నుంచి 2017లో ఇరాన్, 2019లో సిరియా బయటపడ్డాయి. అప్పటి నుంచి సిరియాలో వరుస దాడులు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా సిరియాపై ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థ దాడులకు పాల్పడుతోంది. అలాగే స్లీపర్ సెల్స్‌తో దాడులు చేయిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో సెంట్రల్ టౌన్ సుఖ్నా సమీపంలో కార్మికులపై స్లీపర్ సెల్స్‌తో దాడి జరిగిన ఘటనలో 53 మందిని చంపారు.
ట్రక్కును ఢీకొట్టిన లోకల్ రైలు.. 22 మంది..
Poland Train Accident : పోలాండ్‌లో రైల్వే క్రాసింగ్ వద్ద ఓ ట్రక్కును లోకల్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ వారిని.. దలానోవెక్ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించినట్లు అధికారులు తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురిని మరో ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. గాయపడిన వారిలో రైలు ప్రయాణికులు, డ్రైవర్ కూడా ఉన్నారు.
పాక్ రైలు ప్రమాదంలో 30 మంది మృతి
Pakisthan Train Accident : కొద్దిరోజుల క్రితం.. పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 30 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్సులోని నవాబ్షా జిల్లా సర్హరి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి 1,000 మందికి పైగా ప్రయాణికులతో రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన సుమారు 5 బోగీలు పట్టాలు తప్పాయి. పూర్తి వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Fire Accident In France : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది దివ్యాంగులు మృతి
US Wildfires Today : ఇళ్లను బూడిద చేసిన కార్చిచ్చు.. 36 మంది బలి.. అమెరికా అధ్యక్షుడి కీలక ఆదేశాలు