ETV Bharat / international

'మాపై అత్యాచారాలు ఆపండి'.. కేన్స్​లో నగ్నంగా ఉక్రెయిన్​ మహిళ నిరసన - కేన్స్ ఫిలం ఫెస్టివల్ 2022

Ukraine women cannes: ఉక్రెయిన్​లో మహిళలపై రష్యా సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ఓ మహిళ కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ అత్యాచారాలను ఆపాలంటూ నగ్నంగా నిరసన తెలిపింది.

Ukraine women canne
Ukraine women canne
author img

By

Published : May 21, 2022, 11:38 AM IST

Ukraine women cannes: ఫ్రాన్స్​లో అట్టహాసంగా జరుగుతున్న కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో శుక్రవారం ఓ మహిళ చేపట్టిన నిరసన చర్చనీయాంశంగా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య సినీ తారలతో కోలాహలంగా మారిన ఆ ప్రాంతంలో.. అకస్మత్తుగా ఓ ఉక్రెయిన్​ మహిళ తన పైదుస్తులను తీసేసి.. నిరసన వ్యక్తం చేసింది. శరీరం ముందు భాగంపైన ఉక్రెయిన్​ జాతీయ జెండా, వీపు మీద స్కమ్ అనే పదాన్ని పేయింట్ వేయించుకుంది ఆ మహిళ. అలాగే ఆమె శరీరం ముందు భాగంలో 'స్టాప్​ రేపింగ్​ అస్' అని రాసి ఉంది. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే మోకాళ్లపైన కూర్చొని.. 'మా పైన అత్యాచారాలు ఆపండి' అని బిగ్గరగా అరిచి నిరసన తెలిపింది.

ukraine women
రెడ్​ కార్పెట్​ వద్ద నిరసన తెలుపుతున్న ఉక్రెయిన్​ మహిళ

దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆమెపై వస్త్రాన్ని కప్పారు. ఘటన జరిగిన సమయంలో 'త్రీ థౌజెండ్​ ఇయర్స్​ ఆఫ్​ లాంగింగ్' సినిమాకు సంబంధించిన ఇడ్రిస్​ ఎల్బా, టిల్డా స్వింటన్​ వంటి ప్రముఖ తారలు కూడా ఉన్నారు. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి.. రష్యన్లు ఉక్రెయిన్​ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని పలు వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా సైనికుల తీరును నిరసిస్తూ.. ఆ మహిళ నగ్నంగా ఆందోళన తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్​ పరిస్థితులను వివరిస్తూ.. కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ప్రారంభ వేడుకల రోజు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రసంగించారు.

ఇదీ చూడండి : మస్క్‌పై లైంగిక ఆరోపణలు- 2.5 లక్షల డాలర్లతో సెటిల్‌మెంట్‌..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.