ETV Bharat / international

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఎత్తివేత

Sri Lankan Crisis: శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన వెలువరించారు.

Sri Lankan Crisis
శ్రీలంక
author img

By

Published : Apr 6, 2022, 6:25 AM IST

Updated : Apr 6, 2022, 7:04 AM IST

Sri Lankan Crisis: శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన వెలువరించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.

అత్యవసర పరిస్థితి: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు నిత్యవసరాల కోసం అల్లాడుతున్నారు. పెరిగిన ధరలు, ఆహార పదార్థాలు, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి విధించారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఎవరినైనా నిర్బంధించడం, ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, దేశంలో ఎక్కడైనా సోదాలు జరిపే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.

ఇదీ చదవండి: రష్యా బొగ్గు దిగుమతులపై ఈయూ నిషేధం

Last Updated : Apr 6, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.