ETV Bharat / international

శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్స

Emergency in Sri Lanka
Sri Lanka President
author img

By

Published : Apr 2, 2022, 1:10 AM IST

Updated : Apr 2, 2022, 3:23 AM IST

01:04 April 02

శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్స

శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. అత్యవసర పరిస్థితిని విధిస్తూ గెజిట్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు. శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభంతో గత కొన్ని రోజులుగా ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో రోజుకు 13 గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు.

కొవిడ్ మహమ్మారి సమయంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ‍శ్రీలంక ప్రజలు.. ఆ దేశ అధ్యక్షుడి ఇంటి ముందు చేప‌ట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో 10 మందికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: తారస్థాయికి శ్రీలంక సంక్షోభం.. వీధి దీపాలకూ పవర్​ కట్​

Last Updated : Apr 2, 2022, 3:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.