ETV Bharat / international

భవనంలో మంటలు.. ఒకేగదిలో ఏడుగురు మృతి.. ఆ కుట్రతోనే! - దక్షిణ కొరియా భవనంలో మంటలు

South Korea office building Fire: దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కార్యాలయ భవనంలో చెలరేగిన మంటల్లో ఏడుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కుట్రపూరితంగానే ఓ వ్యక్తి.. భవనానికి నిప్పు పెట్టాడని పోలీసులు భావిస్తున్నారు.

South Korea Fire
South Korea Fire
author img

By

Published : Jun 9, 2022, 10:38 AM IST

Updated : Jun 9, 2022, 12:00 PM IST

South Korea Fire: దక్షిణ కొరియాలోని ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. డేగు నగరంలోని ఓ కార్యాలయ భవనంలో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే గదిలో ఉన్నారని వెల్లడించారు.

Office building Fire SKorea: సహాయక చర్యల కోసం పదుల సంఖ్యలో అగ్నిమాపక దళాలను మోహరించినట్లు డేగు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు వీరంతా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కోర్టు సమీపంలో ఉన్న భవనం రెండో ఫ్లోర్​లో చెలరేగిన ఈ మంటల్లో.. 41 మంది గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రుల్లో చాలా మంది పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురయ్యారని వివరించారు.

south korea office building fire
భవనం వద్ద అంబులెన్సులు, ఫైర్ఇంజిన్లు

కావాలనే నిప్పు పెట్టి...
ఘటనకు గల కారణాలు తెలియలేదు. అయితే, ఓ దుండగుడు కావాలనే భవనానికి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. న్యాయవాది కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి సైతం మంటల్లో కాలిపోయాడని పోలీసు అధికారి జియోంగ్ హెయోన్ వూక్ తెలిపారు. 'నిందితుడు చేతిలో ఏదో కంటైనర్ పట్టుకొని తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దృశ్యాలను గుర్తించాం. కంటైనర్​లో మంటలను వ్యాప్తి చేసే పదార్థాలు ఉండొచ్చు. మృతులంతా ఒకే గదిలో ఉన్నారు. నిందితుడు ఈ ఘటనకు పాల్పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం' అని వివరించారు.

south korea office building fire
ఘటనా స్థలిలో పోలీసులు

డేగు నగరంలో గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. కుట్రపూరితంగా ఓ రైలుకు నిప్పు పెట్టడం వల్ల 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 2003లో ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 9, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.