ETV Bharat / international

స్కూల్​లో విద్యార్థి కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి - సెర్బియాలో స్కూల్ షూటింగ్

ఓ టీనేజీ బాలుడు పాఠశాలలో జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్థులు, ఓ గార్డు మృతిచెందారు. సెర్బియాలోని బెల్​గ్రేడ్​లో బుధవారం జరిగిందీ ఘటన.

serbia shooting teenage boy opened fire in school several killed
స్కూల్​లో కాల్పులు
author img

By

Published : May 3, 2023, 3:25 PM IST

Updated : May 3, 2023, 4:21 PM IST

సెర్బియాలోని ఓ పాఠశాలలో.. విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది విద్యార్థులు కాగా మరొకరు స్కూల్​లో గార్డుగా పని చేస్తున్న వ్యక్తి. అదే పాఠశాలలో చదివే ఓ టీనేజీ బాలుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

తండ్రి తుపాకీతో వచ్చి..
కాల్పులు జరిపిన బాలుడు వయసు సుమారు 14 ఏళ్లు. సెంట్రల్​ బెల్​గ్రేడ్​లోని వ్లాదిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తన తండ్రి తుపాకీని తీసుకుని అతడు బడికి వచ్చాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. మరో ఆరుగురు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు.

serbia-shooting-teenage-boy-opened-fire-in-school-several-killed
స్కూల్​లో విద్యార్థి కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

"మా అమ్మాయి చెప్పిన దాని ప్రకారం.. అతడు (నిందితుడు) లోపలకు వచ్చి ముందుగా ఓ టీచర్​పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత భయంతో డెస్క్​ల కింద దాక్కున్న విద్యార్థుల్ని షూట్ చేశాడు. కాల్పులు జరిపిన వ్యక్తి.. ఇంతకుముందు బాగానే ఉండేవాడని, బాగా చదివే వాడని మా అమ్మాయి చెప్పింది." అని ఓ విద్యార్థిని తల్లి చెప్పారు.

పాఠశాలలో కాల్పుల గురించి ఉదయం 8.40కి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు రంగంలోకి దిగారు. కాల్పులు జరిపిన బాలుడ్ని పాఠశాల ప్రాంగణంలోనే అరెస్టు చేశారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
బడిలో కాల్పుల ఘటన.. విద్యార్థుల తల్లిదండ్రుల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ దాడిలో పిల్లల్ని కోల్పోయిన వారు.. పెను విషాదంలో మునిగిపోయారు.

ఐదుగుర్ని బలిగొన్న వ్యక్తి ఎట్టకేలకు అరెస్ట్
మరోవైపు.. అమెరికాలో ఐదుగుర్ని కాల్చి చంపి పరారైన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఓ ఇంట్లో దాక్కున్న అతడ్ని పక్కా సమాచారంతో అరెస్టు చేశారు.
ఫ్రాన్సిస్కో ఓరోపెజా(38) అనే వ్యక్తి టెక్సాస్ రాష్ట్రం క్లీవ్​ల్యాండ్​లో గత శుక్రవారం ఐదుగుర్ని కాల్చి చంపాడు. మృతులంతా ఫ్రాన్సిస్కో పొరుగు ఇంటి వారే. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సిస్కో తుపాకీ పేల్చుతుండగా.. పక్కింటి వారు అభ్యంతరం తెలిపారు. తుపాకీ శబ్దం వల్ల తమ ఇంట్లోని చిన్నారి నిద్ర పోవడం లేదని, దయచేసి దూరంగా వెళ్లాలని కోరారు. అయితే.. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఫ్రాన్సిస్కో ఐదుగుర్ని కాల్చి చంపాడు. అనంతరం పారిపోయాడు.

పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, శునకాలతో ఫ్రాన్సిస్కో కోసం ఎక్కడికక్కడ గాలించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 80వేల డాలర్లు నగదు బహుమతి ఇస్తామని ఆ రాష్ట్ర గవర్నర్, మరికొందరు ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి. కాన్రోలోని ఓ ఇంట్లో ఫ్రాన్సిస్కో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్టు చేశారు.

Last Updated : May 3, 2023, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.