Ukraine Crisis: జీ7 దేశాల అధినేతల భేటీ జరుగుతున్న వేళ.. ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై విరుచుకుపడింది. పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్‌చుక్ నగరంలో భారీ జనసందోహం ఉన్న షాపింగ్ మాల్‌పై సోమవారం క్షిపణులతో దాడిచేసింది. ఆ సమయంలో 1000కు పైగా పౌరులు వాణిజ్య సముదాయంలో ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. మృతుల సంఖ్యను ఊహించడం కూడా అసాధ్యమని అన్నారు. అయితే 10 మంది పౌరులు మృతి చెందారని, 40 మందికి పైగా గాయాలయ్యాయని, ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
'మొత్తం రెండు క్షిపణులు షాపింగ్ మాల్‌ను తాకాయి. ఆ సమయంలో మాల్ నుంచి పౌరులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆకాశన్నంటేలా మంటలు ఎగసిపడ్డాయి. వాణిజ్య సముదాయంపై దాడిని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రంగా ఖండించారు. పుతిన్ క్రూరత్వానికి, అనాగరికతకు.. ఈ సంఘటన ఒక ఉదాహరణ' అని పేర్కొన్నారు. రష్యాకు ఏ మాత్రం మానవత్వం లేదని, సైనిక ప్రాంతానికి ఏ మాత్రం సంబంధం లేని ప్రాంతంపై దాడి చేయడం అమానవీయమని జెలెన్‌స్కీ మండిపడ్డారు. ఓవైపు రాజధాని కీవ్‌పై దాడులు చేస్తూనే.. లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చేతిలో మిగిలిన ఏకైక నగరమైన లీసీచాన్స్క్ ముట్టడి కార్యక్రమాన్ని రష్యా వేగవంతం చేసింది.
ఇవీ చదవండి: 'ఆ విషయంలో నిబద్ధతతో పనిచేస్తున్నాం.. మా పనితీరే సాక్ష్యం!
ఫ్రెండ్ కార్లో షికారుకు వెళ్లడమే అతడి పొరపాటు.. దారుణంగా కాల్చి...