ETV Bharat / international

రష్యా నుంచి మరో గ్రామం స్వాధీనం.. ఉక్రెయిన్​ ఎదురుదాడి తీవ్రం!

Russia Ukraine War Update : రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లోని మరో గ్రామాన్ని తిరిగి సొంతం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా ఆక్రమించిన మొత్తం ఉక్రెయిన్ ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొంది. అయితే.. ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్న మూడు గ్రామాల నుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్లాయో లేదో మాస్కో ధ్రువీకరించలేదు.

ukraine retake
ukraine retake
author img

By

Published : Jun 12, 2023, 9:35 PM IST

Updated : Jun 12, 2023, 10:01 PM IST

Russia Ukraine War Update : రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో మరో గ్రామం తిరిగి తమ చేతుల్లోకి వచ్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఆగ్నేయ ఉక్రెయిన్ గ్రామమైన స్టోరోజోవ్‌పై తమ దేశ జెండా రెపరెపలాడినట్లు ఉక్రెయిన్‌ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాలియార్ వెల్లడించారు. అంతకుముందు తూర్పు దొనెత్క్స్‌ ప్రాంతంలో వెలికా నోవోసిల్కే పట్టణానికి దక్షిణంగా కలిసి ఉన్న మరో మూడు చిన్న గ్రామాలు రష్యా నుంచి విముక్తి పొందాయని చెప్పారు. రష్యాకు చెందిన వాగ్నర్‌ కిరాయి ముఠా ఇటీవల ఆక్రమించిన బ్లహుడాని గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ఆపరేషన్‌లో 68వ సెపరేట్‌ హంటింగ్‌ బ్రిగేడ్‌.. గ్రామం నుంచి శత్రుసేనలను తరిమికొట్టిందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్న మూడు గ్రామాల నుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్లాయో లేదో మాస్కో ధ్రువీకరించలేదు. కొంతమంది రష్యా సైనిక బ్లాగర్లు ఆ ప్రాంతాల్లో నియంత్రణ కోల్పోయినట్లు అంగీకరించారు. మరోవైపు దక్షిణ , తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలలో వెయ్యి కిలోమీటర్ల మేర తమ సైనికులు ఉన్నారని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌ భారీస్థాయి ఎదురుదాడులను తిప్పికొడుతున్నామని పేర్కొంది. దొనెత్స్క్‌, జపోరిజియా ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ దాడులు విఫలమయ్యాయని నల్ల సముద్రంలో చేసిన బోట్ల దాడినీ సమర్థంగా తిప్పికొట్టామని రష్యా మంత్రిత్వశాఖ తెలిపింది. గ్యాస్‌ పైప్‌లైన్లను పేల్చివేసేందుకు పంపిన అన్ని స్పీడ్‌ బోట్లనూ పేల్చివేశామని చెప్పింది.

ఉక్రెయిన్​కు అమెరికా సాయం..
Ukraine Aid : ఇటీవల రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరోసారి తన సాయాన్ని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దీర్ఘకాల ఆయుధ సాయం కింద అదనంగా 17వేల కోట్ల డాలర్లను అందించనున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ వెల్లడించింది. దీనికింద మరిన్ని పేట్రియాట్‌ క్షిపణులు, క్షిపణులు, హాక్‌ గగనతల రక్షణ వ్యవస్థ, చిన్నపాటి ప్యూమా డ్రోన్ల కొనుగోలుకు నిధులు అందుతాయి. శతఘ్ని గుళ్లు, లేజర్‌ గైడెడ్‌ రాకెట్లను సమకూర్చుకోవడానికి, శిక్షణ తదితర అవసరాలకూ ఈ సొమ్మును వెచ్చిస్తారు. ఇప్పటివరకు అనేక సార్లు ఉక్రెయిన్​కు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అమెరికా.

జులైలో బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాల మోహరింపు: పుతిన్‌
తమ పొరుగు దేశమైన బెలారస్‌లో జులైలోనే వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల ప్రకటించారు. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో భేటీ అయిన అనంతరం ఈ మేరకు వెల్లడించారు. అణ్వాయుధాలను ఉంచేందుకు అవసరమైన నిర్మాణాల ఏర్పాటు జులై 7-8 తేదీల కల్లా పూర్తవుతుందని తెలిపారు. ఆ వెంటనే ఆయుధాల తరలింపు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jun 12, 2023, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.