Russia Attack On Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో 48 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఖర్కీవ్ ప్రాంతంలోని హ్రోజా గ్రామంలో ఒక దుకాణం, కేఫ్‌పై రష్యా బలగాలు గురువారం మధ్యాహ్నం దాడులు చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరేళ్లు బాలుడు కూడా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యను ఉగ్రదాడిగా అభివర్ణించారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మరోవైపు.. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. 'రష్యన్ రాకెట్ దాడి క్రూరమైన నేరం. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన ఉగ్రవాద దాడి. ఇప్పటివరకు 48 మందికి పైగా మృతి చెందారు' అని జెలెన్‌స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. ఈయూ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని పాశ్చాత్య మిత్రదేశాలను అభ్యర్థించారు.
Syria Drone Strike : మరోవైపు.. సిరియాలోని హోమ్‌నీడ్స్ నగరంపై తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే డజన్లు కొద్దిమంది గాయపడ్డారు. ఓ సైనిక కార్యక్రమంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. మృతుల్లో సైనిక సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారని సిరియా సైన్యం తెలిపింది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని.. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు అధికారులు మరణించారని.. మరో 20 మంది గాయపడ్డారని ఓ వార్తా పత్రిక వెల్లడించింది.
Russia Airstrikes Syria : కొన్నాళ్ల క్రితం సిరియాపై రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు చిన్నారుల సహా 13 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. సిరియాలో ఇద్లిబ్ ప్రాంతంలోని తిరుగుబాటు వర్గాలపై అధ్యక్షుడు బషర్ అసాద్‌కు మద్దతిస్తున్న రష్యా వైమానిక దాడులు జరిపింది. తుర్కియే సరిహద్దుల్లోని జిస్ర్ అల్-షుగూర్ నగరంలోని కూరగాయల మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో సాధారణ పౌరులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి.. 8మంది మృతి.. బెలారస్‌కు ప్రిగోజిన్