Research on Cancer 2023 : ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 50 ఏళ్ల లోపు వారిలో కొత్తగా క్యాన్సర్ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 79% పెరిగిందని తెలిసింది. గత 30 సంవత్సరాల పరిశోధన వివరాలను బీఎంజే ఆంకాలజీ అనే ప్రముఖ జర్నల్ బహిర్గతం చేసింది. ఈ అధ్యయనం ద్వారా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి..
- 1990 నుంచి శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు బాగా పెరిగాయి. రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగు, ఉదర క్యాన్సర్ల వల్ల మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి.
- చిన్న వయసులోనే గుర్తించిన క్యాన్సర్లలో.. 2019లో రొమ్ము క్యాన్సర్ కేసులు అతి ఎక్కువగా నమోదయ్యాయి. తక్కువ వయసులో క్యాన్సర్ వచ్చే అవకాశం 2030లో 31 శాతానికి పెరగవచ్చని అంచనా. అలాగే సంబంధిత మరణాల సంఖ్య కూడా 21% వృద్ధి చెందే ఆస్కారముంది.
- 40+ ఏళ్ల వయసులో ఉన్నవారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉండొచ్చు. అయితే, కాలేయ క్యాన్సర్ కొత్త కేసుల నమోదు మాత్రం సంవత్సరానికి దాదాపు 2.88 శాతం తగ్గింది.
- ప్రపంచవ్యాప్తంగా 50 సంవత్సరాలకన్నా తక్కువ వయసు ఉన్న వారిలో క్యాన్సర్ వల్ల 2019లో 10 లక్షల మందికిపైగా చనిపోయారు. 1990తో పోలిస్తే ఈ సంఖ్య 28% అధికం.
- రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధిక మంది శ్వాసనాళం, ఊపిరితిత్తులు, ఉదరం, పేగు క్యాన్సర్‌తో చనిపోతున్నారు. కిడ్నీ, అండాశయ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగింది. తక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో కొత్త క్యాన్సర్ కేసులు మగవారి కంటే మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.
క్యాన్సర్‌కు కారకాలు ఇవే..
- క్యాన్సర్ వ్యాధి రావడానికి జన్యుపరమైన అంశాలు ఒక కారణం. అలాగే మటన్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తినడం.. పాలు, పండ్లు సరైన మోతాదులో తీసుకోకపోవడం క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగేందుకు కారణం అవుతున్నాయి.
- మద్యం సేవించడం, పొగాకు వినియోగం 50 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్ రావడానికి ముఖ్య కారకాలు. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, హైబీపీ సైతం క్యాన్సర్ ముప్పు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.
Brazil Floods 2023 : భారీ వరదలు.. 31 మంది మృతి.. జలదిగ్బంధంలో 60 నగరాలు..