ETV Bharat / international

తిరుగుబాటుదారుల అరాచకం.. 17 మందిని ఉరితీసి​ హత్య - తూర్పు కాంగోలో తిరుగుబాటుదారుల అరాచకం

తూర్పు కాంగోలో తిరిగుబాటుదారులు అరాచకం సృష్టించారు. రోడ్డుపై మూడు వాహనాల్లో ప్రయానిస్తున్న 17 మంది పౌరులను.. కిడ్నాప్​ చేసిన తిరుగుబాటు దారులు వారిని ఉరివేసి చంపారు.

Rebels killed several people in troubled eastern Congo
తిరుగుబాటుదారుల అరాచకం 17 మందిని ఉరి తీసిన వైనం
author img

By

Published : Mar 27, 2023, 11:02 PM IST

Updated : Mar 28, 2023, 10:15 AM IST

తూర్పు కాంగోలో దారుణం జరిగింది. 17 మంది పౌరులను CODECO తిరుగుబాటుదారులు హతమార్చారు. రోడ్డుపై మూడు వాహనాల్లో ప్రయాణిస్తున్న పౌరులను.. కిడ్నాప్​ చేసిన తిరుగుబాటు దారులు అనంతరం వారిని ఉరివేసి చంపారు. "ఇటురి ప్రావిన్స్‌లో కొంత మంది పౌరులను తిరుగుబాటుదారులు కిడ్నాప్​ చేశారు. మూడు వాహనాల్లో వెళుతున్న వారిపై దాడుల జరిపి.. అనంతరం అపహరించారు. వారందరిని తిరుగుబాటుదారులకు బాగా పట్టున్న వాలెందు జట్సీ జిల్లాలోని పెట్షికి తీసుకెళ్లారు. అనంతరం ముగ్గురు డ్రైవర్​లతో సహా 14 మందిని ఉరి వేసి చంపారు." అని కల్నల్ రుఫిన్ మాపెలా మ్వినియామా తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతం అంతా తిరుగుబాటుదారుల అధీనంలోనే ఉందని మ్వినియామా వెల్లడించారు. దీంతో అక్కడ అసలేం జరిగిందన్నది తెలుసుకోవడం కష్టమని చెప్పారు. ఫిబ్రవరిలో కూడా దాదాపు 32 మంది పౌరులను CODECO తిరుగుబాటుదారులు చంపేశారు.

కోడెకో అంటే ఏంటి?
కోఆపరేటివ్ డెవలప్​మెంట్ ఆఫ్ కాంగో (CODECO) అనేది కాంగోలోని లెండు తిరుగుబాటు దారుల అసోసియేషన్. వీరికి హెమా అనే తెగలతో 2017 నుంచి పోరాటం సాగుతోంది. ఇటీవల ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర రూపు దాల్చింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేక మంది చనిపోతున్నారు. కోడెకో తిరుగుబాటు బృందాలు తమ అధీనంలోని ప్రాంతాలను పెంచుకుంటూ వస్తున్నాయి. కాంగో మిలిటరీపై దాడులు చేస్తూ పౌరులను సైతం హతమార్చుతున్నాయి. తమ అధీనంలోని ప్రాంతాల్లో బలవంతంగా పన్ను వసూళ్లకు పాల్పడుతున్నాయి.

120కి పైగా బృందాల తిరుగుబాట్లు
నిజానికి కాంగోలో తిరుగుబాట్లు కొత్త కాదు. దశాబ్దాలుగా ఆ దేశంలో తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. 120కి పైగా సాయుధ బృందాలు ఈ దేశంలో హింసకు పాల్పడుతున్నాయి. కొన్ని బృందాలు తమ జాతులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొన్ని విలువైన గనులపై హక్కుల కోసం పోరాడుతున్నాయి. నార్త్ కివూ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ఎం23 అనే రెబల్ గ్రూప్.. 2021 నుంచి భారీగా విస్తరిస్తోంది. ఊళ్లకు ఊళ్లను ఆక్రమించుకొని, పౌరులను చంపేస్తోంది.
నార్త్ కివూ, ఇటూరి, సౌత్ కివూ రాష్ట్రాల్లో 10 లక్షల మందికి మానవతా సాయం అవసరమవుతోందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఎం23పై ప్రధానంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. కోడెకో, అలైడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ వంటి తిరుగుబాటు దారుల దళాలు రెచ్చిపోతున్నాయని ఐరాస చెబుతోంది. ఇస్లామిక్ స్టేట్​ వంటి సంస్థలతోనూ వీటికి సంబంధాలు ఉన్నాయని తెలిపింది.

Last Updated : Mar 28, 2023, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.