ETV Bharat / international

బ్రిటన్ రాణి రహస్య లేఖ.. 2085 వరకు తెరవడానికి వీల్లేదు.. ఎవరికి రాశారో తెలుసా? - బ్రిటన్ రాజుగా చార్లెస్ 3

Queen Elizabeth 2 letter: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణంతో ఆమెకు సంబంధించిన పలు విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఎలిజబెత్​ 2 రాసిన ఓ రహస్య లేఖ గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ లేఖ ఏంటో, ఎవరి కోసం రాశారో చూద్దామా?

QUEEN LETTER
బ్రిటన్ రాణి లెటర్
author img

By

Published : Sep 13, 2022, 7:31 AM IST

Queen Elizabeth 2 letter: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 అస్తమయంతో ఆమెకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమెకు ఆస్ట్రేలియాతో ముడిపడిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రపంచానికి తెలిసింది. ఇదంతా రాణి రాసిన లేఖ గురించే. ప్రస్తుతం ఆ లేఖను సిడ్నీలో ఓ రహస్య ప్రాంతంలో భద్రపర్చారట. మరో 63 ఏళ్ల వరకు దానిని తెరిచే వీలు లేదట..!

ఆస్ట్రేలియా మీడియా వెల్లడించిన కథనం ప్రకారం.. 1986, నవంబర్‌లో ఎలిజబెత్ 2 ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారు. ప్రస్తుతం దానిని సిడ్నీలోని క్వీన్‌ విక్టోరియా భవనంలో ఓ రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. అయితే, అందులో ఏముందో ఆమె వ్యక్తిగత సిబ్బందితో సహా ఎవరికీ తెలీదు. మరో విషయం ఏంటంటే.. 2085 వరకు దానిని తెరిచి, చదివేందుకు వీలు లేదు. '2085లో తగిన రోజు చూసుకొని ఈ లేఖను తెరవండి. సిడ్నీ ప్రజలకు నా సందేశాన్ని చేరవేయండి' అని నాటి నగర మేయర్‌ను ఉద్దేశించి రాణి సూచించినట్లు తెలుస్తోంది. ఆ లేఖపై ఎలిజబెత్ ఆర్‌ అనే సంతకం కూడా ఉంది.

ఇదిలా ఉంటే.. తమ దేశాధినేత ఎలిజబెత్ 2 మృతి పట్ల ఆస్ట్రేలియా సంతాపం తెలియజేసింది. 16 సార్లు తమ దేశంలో పర్యటించినట్లు వెల్లడించింది. ఇక.. దేశాధినేతగా రాణిని కొనసాగించాలా..? వద్దా..? అనే దానిపై 1999లో ఆ దేశం ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించింది. అయితే అది నెగ్గలేదు. ప్రస్తుతం.. కింగ్‌ ఛార్లెస్‌-3ని తమ దేశాధినేతగా ప్రకటించింది.

ఇవీ చదవండి: 'అమ్మ బాటలోనే నా పయనం'.. పార్లమెంట్​లో బ్రిటన్​ రాజు తొలి ప్రసంగం

చైనాలో రాజ్యాంగ సవరణ.. శాశ్వత అధ్యక్షుడిగా జిన్​పింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.