ETV Bharat / international

క్వాడ్​ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ.. చైనా అసహనం

భారత్ వేదికగా జీ-20 సమావేశాలు జరుగుతున్న వేళ.. క్వాడ్‌ దేశాలు భేటీ కావడంపై చైనా మండిపడింది. దేశాల మధ్య జరిగే చర్చలు శాంతి, అభివృద్ధిని కొనసాగించే విధంగా ఉండాలని పేర్కొంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి నెలకొనడం, సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన క్వాడ్ కూటమిపై మెుదట్నుంచీ గుర్రుగా ఉన్న డ్రాగన్ తాజాగా మరోసారి విమర్శలు గుప్పించింది. విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షతన దిల్లీలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ప్రతినిధులు ఈ క్వాడ్ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్వాడ్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రులు ప్రకటించారు.

quad foreign ministers meet
క్వాడ్ మీటింగ్
author img

By

Published : Mar 3, 2023, 7:23 PM IST

భారత్‌ ఆతిథ్యమిస్తున్న జీ-20 సమావేశాల్లో భాగంగా దిల్లీకి వచ్చిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అధ్యక్షతన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషీ,ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి పెన్నీ వోంగ్ హాజరై.. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా క్వాడ్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రులు ప్రకటించారు.

కొత్త అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన చర్యలను అన్వేషించేందుకు ఈ క్వాడ్ వర్కింగ్‌ గ్రూప్ పనిచేయనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో క్వాడ్ ఎజెండాను సమన్వయం చేసి పూర్తిచేయడానికి మంత్రులు ప్రతిజ్ఞ చేశారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుపై.. అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి కొనసాగించాలని.. చట్టాలు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కాపాడాలని.. భేటీ తర్వాత 4 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. వివాదాలకు శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నాయి.

భారత్‌లో జీ20 భేటికి చైనా విదేశాంగ మంత్రి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే క్వాడ్‌ దేశాలు భేటీ కావడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశాల మధ్య జరిగే చర్చలు శాంతి, అభివృద్ధిని కొనసాగించే విధంగా ఉండాలని పేర్కొంది. దేశాల మధ్య పరస్పర విశ్వాసం ప్రాంతీయ స్థిరత్వానికి దోహదం చేయాలని వెల్లడించింది. దీని కోసం ఆయా దేశాలు మరింత సహకారం అందించాలని చైనా భావిస్తోందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. క్వాడ్‌ అనేది చైనా ఎదుగుదలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కూటమి అని మరోసారి పునరుద్ఘాటించింది. కీలకమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఏ దేశం ఆధిపత్యం ప్రదర్శించకుండా.. కొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి క్వాడ్‌ను ఏర్పాటుచేయాలని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు 2017 నవంబర్‌లో 4 దేశాలు ముందుకు వచ్చాయి.

జీ20 సమావేశం..
2022 డిసెంబర్ 1న జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా చేపట్టింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 200కి పైగా సన్నాహక సమావేశాలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.