ETV Bharat / international

Putin Kim Jong Un Meeting : పుతిన్​తో కిమ్​ భేటీ!.. వాటిపైనే కీలక చర్చ.. అలా చేయొద్దని సూచించిన అమెరికా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 9:23 AM IST

Putin Kim Jong Un Meeting : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్​తో భేటీ అయ్యే అవకాశం ఉందని అమెరికా వెల్లడించింది. ఇరు దేశాధినేతలు ఆయుధాల ఒప్పందం గురించి చర్చించే అవకాశం ఉందని తెలిపింది.

Putin Kim Jong Un Meeting
Putin Kim Jong Un Meeting

Putin Kim Jong Un Meeting : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఉక్రెయిన్​తో యుద్ధం జరుగుతున్నందున రష్యా ఆయుధాలను సమీకరించాలనుకుంటుదని.. ఈ నేపథ్యంలోనే కిమ్​ ఆ దేశంలో పర్యటించే అవకాశాలున్నాయని వెల్లడించారు.

గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ సోమవారం తెలిపారు. క్లెమ్లిన్​కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని చెప్పారు. 'ఈ చర్చలను కొనసాగించాలని, రష్యాలో అధినేతల స్థాయి దౌత్య చర్చలు జరగాలని కిమ్​ జోంగ్ ఉన్ భావిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే, ఆయుధ కొనుగోళ్లపై రష్యాతో చర్చలు నిలిపివేయాలని, ఆయుధాలని విక్రయించకూడదని ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై ఆ దేశం కట్టుబడి ఉండాలని అమెరికా కోరుతోంది' అని వాట్సన్ వివరించారు. అయితే, ఇరు దేశాలు (రష్యా-ఉత్తరకొరియా) సంయుక్త యుద్ధ విన్యాసాలను చేపట్టే అవకాశం ఉందని షోయిగు సోమవారం తెలిపారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు పర్యటించిన తరుణంలోనే పుతిన్​-కిమ్ భేటీ ఉంటుందని అమెరికా అంచనా వేసింది.

ఆ ఆంక్షలు తొలగిస్తేనే!.. తేల్చి చెప్పిన రష్యా!
తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు తొలగిస్తేనే.. తిరిగి ధాన్య ఒప్పందంలోకి చేరతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తేల్చి చెప్పారు. ఈ మేరకు పుతిన్​ సోమవారం తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో చర్చించారు. యుద్ధం కొనసాగుతున్న కారణంగా నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్-రష్యా వ్యవసాయ ఉత్పత్తుల సురక్షిత రవాణాకు సంబంధించి గతంలో ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్యవర్తిత్వంతో ధాన్య ఒప్పందం కుదిరింది.

అయితే తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మాత్రం పాశ్చాత్య దేశాలు ఆటంకం కలిగిస్తున్నాయని రష్యా పేర్కొంది. అనంతరం జులైలో ఆ ఒప్పందం నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంలో మాస్కోను బుజ్జగించేందుకు, ఒప్పందం పునరుద్ధరించేందుకు ఎర్డొగాన్‌.. రష్యా వచ్చి పుతిన్‌తో చర్చలు జరిపారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలోనే కనుగొంటామని అని తుర్కియే అధ్యక్షుడు చెప్పారు.

పుతిన్, కిమ్ దోస్తీ.. ఆయుధాల కోసం రష్యా.. సంబంధాల బలోపేతం కోసం కొరియా

ఆ దేశాల సంగతి చూద్దాం అంటూ పుతిన్, కిమ్​ ప్రేమ లేఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.